logo

కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
Highlights

జగన్ ప్రభుత్వం ఏపీలో సామాజిక విప్లవానికి నాంది పలికింది. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ...

జగన్ ప్రభుత్వం ఏపీలో సామాజిక విప్లవానికి నాంది పలికింది. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్‌ మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పలు చారిత్రాత్మక బిల్లులను ఆమోదించింది. అలాగే శాశ్వత బీసీ కమిషన్‌‌ను ఏర్పాటుకు అడుగులు వేస్తూ మరో బిల్లును పాస్ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక విప్లవానికి జగన్ ప్రభుత్వం నాంది పలికింది. సమాజంలో వెనుకబడిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, అలాగే మహిళలకు నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక బిల్లులను సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించడంపై మహిళా శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


లైవ్ టీవి


Share it
Top