Andhra Pradesh Jobs: ఏపీలో కాంట్రాక్ట్ జాబ్స్

Andhra Pradesh Jobs: ఏపీలో కాంట్రాక్ట్ జాబ్స్
x
Highlights

ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల యువతకు శుభవార్త.

ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల యువతకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేర్వేరు డిపార్ట్‌మెంట్స్‌లో ఉద్యోగాల భర్తీకి ఎప్పటి కప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంది .

ఇప్పుడు ఇదే కోణంలో నిరుద్యోగుల కోసం మరో నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది.

కృష్ణా జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ విజయవాడలోని సఖి వన్ స్టాప్ సెంటర్‌, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మచిలీపట్నంలోని ప్రత్యేక దత్తత సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. స్థానిక అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక విద్యార్హతను చూసుకుంటే ఒక్కో పోస్టుకి ఒక్కో విద్యార్హత కలిగి ఉంది.





మొత్తం ఖాలీళ సంఖ్య 8

కౌన్సిలర్ (వుమెన్)- 1 ♦ ఐటీ స్టాఫ్- 3 ♦ మల్టీపర్పస్ హెల్పర్- 1 ♦ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ (వుమెన్)- 1 ♦ కేస్ వర్కర్ (వుమెన్)- 1 ♦ పారా లీగల్ పర్సనల్ / లాయర్- 1

వయోపరిమితి

♦ 18 నుంచి 42 ఏళ్లు.

దరఖాస్తు ప్రారంభ తేది

♦2019 డిసెంబర్ 5

దరఖాస్తుకు చివరి తేదీ

♦ 2019 డిసెంబర్ 20 సాయంత్రం 5 గంటలు

వేతనం వివరాలు

♦ రూ.6,000 నుంచి రూ.20,000.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ, SNR అకాడమీ రోడ్, కార్మెల్ మాత చర్చి దగ్గర, నర్సరీ రోడ్డు ఎదురు వీధి, కానూరు, విజయవాడ- 520007.

మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి https://krishna.ap.gov.in/ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories