ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ..

ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ..
x
Highlights

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజ్ వద్ద 8లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తింది.

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజ్ వద్ద 8లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తింది. వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ దగ్గర అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమీక్షించారు. ప్రభుత్వ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అమరావతిలోని మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో మంత్రులు అనిల్, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. అధికారులతో భేటీ అయిన మంత్రులు.. కృష్ణా‌నదిలో కొనసాగుతున్న వరద ఉధృతిపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నట్లు మంత్రులకు అధికారులు వివరించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. వరద ముప్పు ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు కృష్ణా వరద పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. 12 నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీ స్థాయిలో వరద వస్తోందని పేర్కొంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 63 గ్రామాలు ప్రభావితమయ్యాయని, గుంటూరు జిల్లాలో ఒకరు మృతి, కృష్ణా జిల్లాలో ఒకరు గల్లంతు అయ్యారని సర్కారు తెలిపింది. కృష్ణా జిల్లాలో 8100 మంది, గుంటూరు జిల్లాలో 1609 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా జిల్లాలో 35, గుంటూరు జిల్లాలో 11 మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. అలాగే, కృష్ణా జిల్లాలో 160 ఇళ్లు, 935 హెక్టార్ల పంట దెబ్బతిన్నట్టు సర్కార్ తెలిపింది. గుంటూరు జిల్లాలో 678 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. 1494 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతింది. కృష్ణా జిల్లాలో 120 మంది, గుంటూరు జిల్లాలో 60 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, తెనాలి, రేపల్లె, మంగళగిరి మండలాల్లో బోట్‌ టీమ్‌లు ఏర్పాటు చేశారు. పులిచింతల దగ్గర రెస్క్యూ, బోట్‌ టీమ్‌లు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories