చంద్రబాబు..లోకేష్ ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయిస్తాం : ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

చంద్రబాబు..లోకేష్ ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయిస్తాం : ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
x
Anil Kumar Yadav (File Photo)
Highlights

నిబంధనల ప్రకారం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారికీ కరోనా టెస్ట్ లు చేయడం జరుగుతుందని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

నిబంధనల ప్రకారం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారికీ కరోనా టెస్ట్ లు చేయడం జరుగుతుందని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. అందుకే రెండునెలలుగా హైదరాబాద్ లో ఉండి అమరావతికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అయన ప్రకటించారు.

ఇదలా ఉంటె.. తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి పై ఆ పార్టీ నాయకులు చేసిన విమర్శలను మంత్రి అనిల్ కుమార్ గట్టిగా తిప్పికొట్టారు. ''చంద్రబాబు రెండు నెలల తరువాత వచ్చి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎవరు దివాళా తీశారు ప్రజలకి తెలిసే బుద్ధి చెప్పారు.అధిక పన్నులు వసూలు చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ని టెస్ట్ చెయ్యలేదని బాధపడుతున్నట్టు ఉన్నారు. కంగారుపడకండి మిమ్మల్ని కూడా టెస్ట్ చేయిస్తాం'' అని మంత్రి అన్నారు.

అంతేకాకుండా ''LG పాలిమర్స్ కు, వైఎస్ జగన్ కు ఒకే లాయర్ ఉంటే తప్పేంటి? మంచి లాయర్ అనిపిస్తే ఎవరైనా ఎవరినైనా పెట్టుకుంటారు. దాని విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేయడం సిగ్గుచేటైన విషయం. రైతులకు సహాయం చేస్తే చంద్రబాబుకు ఏడుపు ఎందుకు? వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ బ్రతికే చంద్రబాబుకు రాజ్యాంగం గురించి మాట్లాడటం ఏమిటి? అయినా మహానాడు ఎమ్మెల్యేలు జారిపోతున్నారని భయంతో చంద్రబాబు డప్పు కొట్టుకోవడానికి పెట్టుకున్న కార్యక్రమం. అంటూ మంత్రి అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. ఎప్పటికీ మా జగన్ హీరోనే.. చంద్రబాబు జీరోనే అంటూ వ్యాఖ్యానించారు మంత్రి అనిల్ కుమార్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories