Top
logo

డాక్టర్ సుధాకర్ కేసు సంచలన మలుపు.. సీబీఐకి ఇస్తూ హైకోర్ట్ ఆదేశాలు!

డాక్టర్ సుధాకర్ కేసు సంచలన మలుపు.. సీబీఐకి ఇస్తూ హైకోర్ట్ ఆదేశాలు!
Highlights

డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై శుక్రవారం ఏపీ...

డాక్టర్ సుధాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణచేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. ప్రభుత్వ నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించామని కోర్టు చెప్పింది.

Web Titleandhra pradesh highcourt ordered CBI to take over Visakhapatnam dr Sudhakar case
Next Story