ఏపీలో కొలువుల పండగ...15 వేల పోస్టులకు నోటిఫికేషన్!

ఏపీలో కొలువుల పండగ...15 వేల పోస్టులకు నోటిఫికేషన్!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొలువుల భారీ నోటిఫికేషన్ ను అతి త్వరలో విడుదల చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొలువుల భారీ నోటిఫికేషన్ ను అతి త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షల్లో గ్రామ, వార్డు సచివాలయ పోస్టులను భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విభాగాల్లో ఇంకా కొన్ని పోస్టులు భర్తీ కాని పోస్టులు ఖాళీ ఉండడంతో మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్‌) విభాగాల్లో మొత్తం 15 వేల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. దీంతో అతి త్వరలో ఈ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

ఇక వీటిలో విభాగాల వారీగీ పోస్టులను చూసుకుంటే అగ్నిమాపకశాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మెన్‌, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌, వార్డెన్, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ విభాగాల్లో 4 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలిపారు.

అదే విధంగా పోలీసు శాఖలో చూసుకుంటే సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 11 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలిపారు.

కాగా వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయా క్యాటగిరీల అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఈ ఉద్యోగాల దశల వారీగా భర్తీ చేయనున్నామని, ఉద్యోగాల భర్తీ కోసం ఏటా ప్రభుత్వం విడుదల చేసే క్యాలెండర్‌లో ఈ నోటిఫికేషన్ కు చోటు కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఇక దశల వారీగా పోస్టులను భర్తీ చేయనుండడంతో మొదటి దశలో ఏయే పోస్టులను, ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే విషయంపై ఈ నెల మూడో వారం తర్వాత స్పష్టత రానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories