ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
x
YSJagan(File Photo)
Highlights

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగానే 21 రోజుల లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. అందులో భాగంగానే 21 రోజుల లాక్ డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.కేంద్ర ప్రభుత్వం.. 21 రోజుల లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాల పైన ఎఫెక్ట్ పడింది. ఈ క్రమంలో పలు ఆలయాలను మూసివేశారు. దీంతో అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న ఆలయాలకు ఎలాంటి ఆదాయం లేదు.. దీనితో ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నేపధ్యంలో చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు నిర్ణయంతీసుకుంది. ఈ విషయాన్నీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500మంది అర్చకులకు లబ్ది చేకూరనుంది. కరోనా లాంటి కష్ట సమయంలో ఆదుకున్న ఏపీ ప్రభుత్వానికి ఏపీ అర్చక సమాఖ్య సంతోషం వ్యక్తం చేసింది.

ఇక ఏపీలో కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు.. నిన్న(బుధవారం) తొమ్మిది గంటల్లో మ‌రో 34 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయ‌ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రక‌టించింది. గుంటూరులో 8, అనంతపురంలో ఏడు , ప్రకాశంలో జిల్లాలో మూడు, పశ్చిమ గోదావరిలో ఒకరికి పాజిటివ్ తేలింది. కాగా.. విశాఖలో ముగ్గురు రోగులు కోలుకున్నారు. తాజా కేసులుతో ఏపీలో 348మంది క‌రోనా సోకిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 9 మంది వైరస్ నుంచి కోలుకోగా.. నలుగురు ఈ మ‌హమ్మరి బ‌రిన‌ప‌డి మ‌ర‌ణించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories