ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
x
YS Jagan (File Photo)
Highlights

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీనితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం తో పాటు వెయ్యి రూపాయల నగదును అందజేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ ఉండగా ఈరోజు నుంచి వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి 1000 రూపాయలను అందజేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో సగం వేతనం ఇస్తామని నిధులు ఏర్పాటయ్యాక మిగితా వేతనాన్ని చెల్లిస్తామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు..

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా తమ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకోవాల్సిన చాలామంది లబ్ధిదారులు వేరే రాష్ట్రాల్లో ఉండిపోవడంతో ఈ నెల అందుకోవాల్సిన పెన్షన్ దారులకు వచ్చే నెల రెండు పెన్షన్లను కలిపి ఒకేసారి అందజేస్తామని హామీ ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల పెన్షన్లను వేలి ముద్రలు, ఐరిష్, సంతకాలు లేకుండానే ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఏపీలో 164 అరవై పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఇక తెలంగాణలో 229 కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories