ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
x
Highlights

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే వైఎస్ఆర్ చేయూతతో...

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే వైఎస్ఆర్ చేయూతతో పాటు జగనన్న తోడు అనే పేరుతో మరో పథకం ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకే.. మంత్రివర్గం మొగ్గు చూపింది. ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చ్‌లో ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 16న గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు బీఏసీ సమావేశం జరుగుతుంది.

ఇటు ఆగస్టు 12 న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనుంది. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న జగనన్న తోడు కార్యక్రమం ద్వారా.. చిరు వ్యాపారులకు సున్నా వడ్డీతో రుణాలు అందజేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories