Top
logo

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Highlights

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 14రోజులపాటు బడ్జెట్‌ సమావేశాలు జరగగా, 78గంటల 35నిమిషాలు సభ...

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 14రోజులపాటు బడ్జెట్‌ సమావేశాలు జరగగా, 78గంటల 35నిమిషాలు సభ కొనసాగింది. ప్రభుత్వం 20 బిల్లులను ప్రవేశపెట్టగా 19 కీలక బిల్లులను సభ ఆమోదించింది.

ఈ బడ్జెట్‌ సమావేశాలు చరిత్రాత్మకమైనవని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఎన్నడూ లేనివిధంగా బిల్లులపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. మొత్తం 327 ప్రసంగాలు నమోదైనట్లు తెలిపిన స్పీకర్‌ ఇలా అర్ధవంతమైన చర్చలు జరగడానికి సహకరించిన సభానాయకుడు జగన్మోహన్‌‌రెడ్డిని అభినందిస్తున్నానని అన్నారు.


లైవ్ టీవి


Share it
Top