గుజరాత్‌ నుంచి ఏపీకి చేరుకున్న మత్స్యకారులు..

గుజరాత్‌ నుంచి ఏపీకి చేరుకున్న మత్స్యకారులు..
x
Highlights

కేంద్ర ప్రభుత్వం లక్దౌన్ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు ఇలా వివిధ కారణాలతో స్వస్థలాలకు దూరంగా చిక్కుపడి...

కేంద్ర ప్రభుత్వం లక్దౌన్ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. వలస కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు ఇలా వివిధ కారణాలతో స్వస్థలాలకు దూరంగా చిక్కుపడి పోయిన వారు వారి వారి ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు కల్పించింది. కేంద్ర ఆదేశించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. ఈ మేరకు గుజరాత్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఎట్టకేలకు స్వరాష్ట్రానికి చేరుకున్నారు.

మొత్తం 12 బస్సుల్లో 887 మంది మత్స్యకారులను ప్రభుత్వం రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా వారికి గరికపాడు చెక్ పోస్టు వద్ద విప్ సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ ఉదయభాను మత్య్సకారులకు జగ్గయ్యపేట వద్ద కిచిడీ ప్యాకెట్లు పంపిణి చేశారు. అయితే మత్స్యకారులందరూ ఆయా జిల్లాల్లోని క్వారంటైన్ సెంటర్లలోనే 14 రోజుల పాటు గడపాల్సి ఉంటుంది. క్వారంటైన్ పూర్తయ్యాక ఇళ్లకు పంపనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories