కోడెల కళ్ల ముందే ఉన్నట్లుగా క్లయ్ మోడల్ విగ్రహం సిద్ధం

కోడెల కళ్ల ముందే ఉన్నట్లుగా క్లయ్ మోడల్ విగ్రహం సిద్ధం
x
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మరణం పలువురిని కలిచి వేయగా మరికొందరు అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటు చేయించడంలో నిమగ్నమయ్యారు....

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మరణం పలువురిని కలిచి వేయగా మరికొందరు అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటు చేయించడంలో నిమగ్నమయ్యారు. తెలుగు రాష్ర్టాల్లో విగ్రహాలు తయారీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏకే ఆర్ట్స్ సంస్థ కోడెల విగ్రహాన్ని తయారు చేసింది. కోడెలతో ఉన్న సన్నిహిత సంబంధంతో ఆయన విగ్రహం తయారు చేసినట్లు నత్తా రామేశ్వరంలోని ఏకే ఆర్ట్స్ సంస్థ నిర్వాహకులు కరుణాకర్ వడియార్ చెప్పారు.

సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని కోడెల దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ తయారు చేయించారని ఏకే సంస్థ నిర్వాహకులు గుర్తు చేసుకున్నారు. కోడెల మరణం కలచివేసిందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల విగ్రహాన్ని తమ చేతుల మీదుగా తయారు చేసి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని సంకల్పించారు. కేవలం 48 గంటల్లోనే కోడెల విగ్రహాన్ని తయారు చేశారు. మొదట క్లయ్ మోడల్ లో కోడెల విగ్రహాన్ని రూపొందించారు. నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు కోడెల విగ్రహాలు తయారు చేయాలంటూ ఆర్డర్స్ ఇవ్వడంతో మరికొద్ది రోజుల్లో సిద్ధం చేస్తామంటున్నారు ఏకే ఆర్ట్స్ కళాకారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories