తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన రుతు పవనాలు

తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన రుతు పవనాలు
x
Highlights

నైరుతి రుతు పవనాలు తెలుగురాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. రుతుపవనాలతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు...

నైరుతి రుతు పవనాలు తెలుగురాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించాయి. రుతుపవనాలతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగుబాట పట్టారు. ఇప్పటికే దుక్కులు దున్ని పెట్టారు. విస్తారంగా వర్షాలు పడుతుండటంతో విత్తనాలు వేస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, పెసర్లు, కందులు, మినుములు, ఉల్లి, చెరుకు తదితర పంటలు వేసేందుకు అన్నదాతలు రెడీ అయ్యారు. వరినాట్లు వేసేందుకు ఆకు మడులు కొందరు పోస్తున్నారు. కొందరు ఇప్పటికే అక్కడక్కడా వరి విత్తులు చల్లి నారు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తోంది ప్రభుత్వం. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఏడాదైనా పంటలు బాగా పండుతాయని ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories