మోహన్ బాబు కి – టీటీడీ చైర్మన్ పదవి..?

మోహన్ బాబు కి – టీటీడీ చైర్మన్  పదవి..?
x
Highlights

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. కాగా ఈ నెల 30వ తేదీన వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం...

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. కాగా ఈ నెల 30వ తేదీన వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఇక అందరి దృష్టీ మంత్రివర్గం కూర్పు పైనే ఉంది. మంత్రివర్గం ఎవరెవరు ఉండబోతున్నారన్న చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉండగా నామినేటెడ్ పోస్టుల పై కూడా విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఏపీలో నామినేటెడ్ పోస్ట్ అనగానే టీటీడీ చైర్మన్ పదవి వైపు చాలా మంది ఆశావహులు చూస్తారు. ఇప్పుడు కూడా ఈ పదవి కోసం పలువురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది.

ఇందులో తాజాగా సినీ నటుడు మోహన్ బాబు పేరు తెర పైకి వచ్చింది. ఎన్నికలకు ముందు మోహన్ బాబు స్వయంగా వైసీపీలో చేరడంతో పాటు, టీడీపీకి వ్యతిరేకంగా తన కొడుకులతో పాటు ప్రచారాన్ని నిర్వహించారు. అంతే కాకుండా తిరుపతి లో మోహన్ బాబుకు విద్యా సంస్థలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆయన తిరుపతి వాస్తవ్యుడు కావడం కూడా టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉండడానికి కారణంగా చెబుతున్నారు.

అదీ కాకుండా మోహన్ బాబు ప్రస్తుతం ఫిలిం నగర్ లోని దైవసన్నిధానం చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ దైవసన్నిధానం శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో ఉందని అంటున్నారు. ఇపుడు కాబోయే ముఖ్యమంత్రికి శారదా పీఠం స్వామీజీ గురుతుల్యులుగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యం లో మోహన్ బాబుకు స్వామీజీ ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories