Proddatur: డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన ప్రొద్దుటూరు యువతి.. పేదలకు సేవ చేస్తానంటున్న సాయి హర్షిత

A Young Woman From Proddatur Was Selected For The Post Of Deputy Collector
x

Proddatur: డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికైన ప్రొద్దుటూరు యువతి.. పేదలకు సేవ చేస్తానంటున్న సాయి హర్షిత

Highlights

Proddatur: ఫ్రిడ్జ్ మెకానిక్‌గా పనిచేస్తున్న సాయి హర్షిత తండ్రి

Proddatur: ఒక సాధారణ మెకానిక్ కూతురు గ్రూప్ వన్ ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపిక అవ్వడంతో ఆకుటుంబంలో ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. కడప జిల్లా ప్రొద్దూటూరుకు చెందిన వెంకట సుబ్బయ్య ఫ్రిడ్జ్ మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన కుమార్తె సాయి హర్షిత బీటెక్ చదివింది. తరువాత సివిల్స్ కి ప్రిపేర్ అవుతోంది, ఈక్రమంలో గత సంవత్సరం ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ వన్ పరీక్షలకు అప్లయ్ చేసిన సాయి హర్షిత అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం సంపాదించింది. తనకు డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం రావడం ఎంతో సంతోషంగా ఉందని, పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సాయి హర్షిత చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories