ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు కారు నెంబర్ ప్లేట్ పై జగన్ పేరు..

ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు కారు నెంబర్ ప్లేట్ పై జగన్ పేరు..
x
Highlights

ట్రాఫిక్ చలానాల నుండి తప్పించుకునేందుకు ఓ యువకుడు ఏకాంగా తన కారుకు ఉన్న నెంబర్ ప్లేట్స్ కి ఇరువైపులా ఏపీ ముఖ్యమంత్రి జగన్(AP CM JAGAN) అని రాసి...

ట్రాఫిక్ చలానాల నుండి తప్పించుకునేందుకు ఓ యువకుడు ఏకాంగా తన కారుకు ఉన్న నెంబర్ ప్లేట్స్ కి ఇరువైపులా ఏపీ ముఖ్యమంత్రి జగన్(AP CM JAGAN) అని రాసి పెట్టుకున్నాడు. దీనిని గుర్తించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జరిమానా విధించారు. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లాకి చెందినా హరి రాకేష్ అనే యువకుడు ఓ కళాశాలలో బిటెక్ చేస్తున్నాడు.

తానూ వాడే కారుకి నెంబర్ ప్లేట్ పై నెంబర్స్ కి బదులు ఏకంగా జగన్ పేరు రాసుకొని ఉపయోగిస్తున్నాడు. ట్రాఫిక్ చలానాలు, టోల్ ఫీ చెకింగ్‌ల నుంచి తప్పించుకోవడానికే తాను ఈ విధంగా జగన్ పేరు రాసకున్నట్టు సదరు యువకుడు పోలీసులకు చెప్పాడు. దీనిపైన జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఎవరైనా ఇలా చేస్తే వారికీ శిక్షలు తప్పవని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories