ఫేస్ బుక్ లో వల .. 11 లక్షలు వసూలు

ఫేస్ బుక్ లో వల .. 11 లక్షలు వసూలు
x
Highlights

సామాజీక మాధ్యమాల ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకొని అ తర్వాత వారి దగ్గరి నుండి వివరాలు సేకరించి వారిని డబ్బులు కావాలంటూ వేధించే ఘటనలు ఈ మధ్య మనం...

సామాజీక మాధ్యమాల ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకొని అ తర్వాత వారి దగ్గరి నుండి వివరాలు సేకరించి వారిని డబ్బులు కావాలంటూ వేధించే ఘటనలు ఈ మధ్య మనం తరచుగా చూస్తూనే ఉన్నాం . తాజాగా ఇలాంటి ఘటన కూడా ఒకటి కూడా చోటు చేసుకుంది . మైనర్ బాలికను ప్రేమ పేరిట లొంగబరుచుకున్నాడు ఓ యువకుడు . ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసాడు . తనకి కావలసినంత డబ్బు ఇవ్వకపోతే అ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని తన స్నేహితుడు సాయితో కలిసి బెదిరించాడు హేమంత్.

అ బాలిక బయపడుతూ పలుమార్లు అన్ని కలిపి పదకొండు లక్షల రూపాయలను ఇచ్చింది . అయిన వారి అరాచకాలు ఆగలేదు . మరో నలుగురితో కలిసి బాలిక తల్లితండ్రులకు ఫోన్ చేసి నలబై లక్షలు ఇవ్వాలని కోరారు . లేని నేపధ్యంలో మీ కుమార్తె ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు .దీనితో బాలిక తల్లి తండ్రులు సైబరాబాద్ పోలీసులలను ఆశ్రయించడంతో వారు నిందితులు తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంకి చెందినా వ్యక్తులుగా గుర్తించి అరెస్ట్ చేసారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories