వామ్మో..! ఒకే ఒక్కడు.. 5 మండలాలు.. 82 కరోనా కేసులు!!

వామ్మో..! ఒకే ఒక్కడు.. 5 మండలాలు.. 82 కరోనా కేసులు!!
x
Representational Image
Highlights

కరోనా ఎంత ప్రమాదకారో స్పష్టం చేసే విషయం ఇది. దీనికి ఒక్కరు దొరికితే చాలు పదుల సంఖ్యలో ఈ మహమ్మారికి చిక్కిపోయినట్టే! కరోనా జాగ్రత్తల గురించి చెప్పీ మొబైల్ ఫోన్లకు కూడా విసుగు వచ్చేస్తోంది.

కరోనా ఎంత ప్రమాదకారో స్పష్టం చేసే విషయం ఇది. దీనికి ఒక్కరు దొరికితే చాలు పదుల సంఖ్యలో ఈ మహమ్మారికి చిక్కిపోయినట్టే! కరోనా జాగ్రత్తల గురించి చెప్పీ మొబైల్ ఫోన్లకు కూడా విసుగు వచ్చేస్తోంది.ఎవరికీ వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని చెపుతున్నా కొద్దిపాటి నిర్లక్ష్యం కొంపలు ముంచేస్తోంది. ఎపీలోని తూర్పుగోదావరి జిల్లలో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే, కరోనా ప్రమాదం ఏమిటో స్పష్టంగా అర్థం అవుతుంది.

ఒకే ఒక్కడు.. ఈ గొలుసు కట్టు చూడండి..

తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడ గ్రామం. ప్రశాంతమైన ఊరు. అక్కడ ఈనెల 21న తొలి కరోనా కేసు నమోదు అయింది. వెంటనే అతనిని కాకినాడ జీజీహెచ్ కు తీసుకువెళ్ళారు. అక్కడ అదేరోజు ఆటను మరణించాడు.

ఇక గొల్లల మామిడాడ గ్రామంలో కలకలం మొదలైంది. ఆ చనిపోయిన వ్యక్తి ఆ గ్రామంలో నాలుగు వివాహ వేడుకలకు హాజరు అయ్యారు. ఈ విషయం తెలిసిన అధికారులు ఉరుకులు పరుగులు మొదలు పెట్టారు. మండలం మొత్తం జల్లెడ పట్టారు. ఒక్క ఆ గ్రామంలోనే 54 కేసులు బయటకు వచ్చాయి. ఇక మండలంలోని పెద్దాడ, రాజుపాలెం, పైన గ్రామాల్లో ఒక్కో కేసు నమోదు అయింది. ఇక్కడితో ఇది ఆగలేదు. ఆ వేడుకలకు హాజరైన్ చుట్టుపక్కల మండలాల ప్రజలకూ పాకింది. ఈ విధంగా బిక్కవోలు మండలంలో 17 కేసులూ.. రామచంద్రాపురం మండలంలో 6 కేసులూ, మండపేట, అనపర్తి మండలాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. మొత్తం ఒక్కడితో ఐదు మండలాల్లోని 82 మందిని కరోనా కాటేసింది.

ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఇవన్నీ పల్లెటూళ్ళు. తూర్పు గోదావరిలో చిన్న చిన్న ఊళ్ళన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. దీంతో ఇక్కడ త్వరగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. గొల్లల మామిడాడ గ్రామానికి వెళ్ళే అన్ని దారులూ మూసివేశారు. మొత్తం చక్రబంధం చేశారు. ప్రజల్ని ఇల్లుదాటి రాకుండా కట్టడి చేశారు. అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు. ప్రజలు కూడా సహకరించి విషయాన్ని అర్థం చేసుకుని ఇళ్లలోనే ఉండడం శ్రేయస్కరం అని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఒక్క వ్యక్తి తో ఇంతమందికి కరోనా రావడం రాష్రంలో ఇదే మొదటి సారి. ఇంతకూ ముందు కర్నూలు జిల్లలో ఒకరి వల్ల 32 మందికి వచ్చింది. అదేవిధంగా కృష్ణా జిల్లలో ఒకరితో 18 మందికి, గుంటూరులో ఒకే ఒక్కడి వల్ల 17 మందికీ కరోనా వ్యాప్తి జరిగిందని తెలుస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని గొల్లల మామిడాడ సంఘటన సూచిస్తోంది.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories