దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్లలో ఏపీ లోని సీతానగారానికి 20 వ స్థానం

దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్లలో ఏపీ లోని సీతానగారానికి 20 వ స్థానం
x
Highlights

2018 సంవత్సరానికి ఉత్తమ పోలీస్ స్టేషన్ ల జాబితా ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి 20 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్...

2018 సంవత్సరానికి ఉత్తమ పోలీస్ స్టేషన్ ల జాబితా ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి 20 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ కు జాబితాలో 20 వ స్థానం దక్కింది. మొదటి మూడు స్థానాలు దక్కించుకున్న పోలీస్ స్టేషన్లు రాజస్థాన్, అండమాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి. కేంద్ర హోం శాఖ జరిపిన సర్వేలో ఈ ర్యాంకింగ్ లు ఇచ్చారు. రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలోని కలు పోలీస్ స్టేషన్ దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ గా నిలిచింది. నికోబార్ జిల్లాలోని కాంప్ బెల్ బె రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గానూ, పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలోని ఫరక్క పోలీస్ స్టేషన్ మూడో ఉత్తమ పోలీస్ స్టేషన్ గానూ నిలిచాయి.

2016 నుంచి ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 15,666 పోలీస్ స్టేషన్లలో.. కొన్ని ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్లలో ఈ సర్వ్ నిర్వహించారు. నేరాల నిరోధం, పరిశోధన, కేసుల పరిష్కారం, నేరాల గుర్తింపు, కమ్యూనిటీ పోలీసింగ్, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాల ఆధారంగా సర్వే జరిపారు. అంతే కాకుండా పోలీస్ స్టేషన్ లో లభిస్తున్న సౌకర్యాలు, పౌరుల నుంచి వస్తున్నా స్పందన వంటి అంశాలనూ పరిగణన లోకి తీసుకున్నట్టు హోంశాఖ వర్గాలు తెలిపాయి.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు 20 వ స్థానం దక్కడం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories