యాచకుడి ఇంట్లో నోట్ల కట్టలు... లెక్కింపునకు కౌంటింగ్ మెషీన్!

యాచకుడి ఇంట్లో నోట్ల కట్టలు... లెక్కింపునకు కౌంటింగ్ మెషీన్!
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా తునిలో పాడుబడ్డ ఇంట్లో ఉంటున్న ఓ యాచకుడి నోట్ల కట్టలు బయట పడ్డాయి. నోట్ల కట్టలు అంటే వెయ్యో, రెండు వేలో, 10వేలో కాదు ఆ మనీ...

తూర్పుగోదావరి జిల్లా తునిలో పాడుబడ్డ ఇంట్లో ఉంటున్న ఓ యాచకుడి నోట్ల కట్టలు బయట పడ్డాయి. నోట్ల కట్టలు అంటే వెయ్యో, రెండు వేలో, 10వేలో కాదు ఆ మనీ లెక్కెట్టడానికి మిషన్లు వాడుతున్నారు. ఇంట్లో ఉన్న అటకపై, పోపు డబ్బా దగ్గర నుంచి పరుపు కింద వరకూ. ఎక్కడ పడితే అక్కడ కట్టలు బయట పడ్డాయి. మూటల్లోనూ, మాసిపోయిన బట్టల్లోనూ ఎక్కడ చూసినా నోట్లే.

తూర్పుగోదావరి జిల్లా లోని ఓ పాడుబడ్డ ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి తాజాగా మృతి చెందాడు. గతంలో పురోహితం చేసుకునే ఇతగాడు ప్రస్తుతం స్థానిక దేవాలయం వద్ద భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాజాగా ఆయన అనారోగ్యంతో చనిపోయాడు. అయితే దుర్వాసన రావడంతో చుట్టుపక్కవారు అంత్రక్రియలు పూర్తి చేశారు. అనంతరం ఆయన ఉండే నివాసంలో లక్షలాది రూపాలు కొత్త నోట్లు దర్శనమివ్వడంతో అందరూ అవాక్ అయ్యారు. నోట్ల కట్టలను చూసి కంగుతిన్న స్థానికులు, బంధువులు లెక్కిస్తూ ఆశ్చర్యానికి గురువుతున్నారు. పాతబడిపోయిన ఇంట్లో తరగని సంపద చూసి ఆశ్చర్యపోతున్నారు. అది బిక్షటన పై రావడంతో ఖంగుతిన్నారు. క్యాస్ మిషిన్ తో లెక్కించే స్థాయిలో సొమ్ములు బయటపడటంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆశక్తిగా ఆ సంపదను తిలకిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories