బిస్కెట్లు తిని జీవిస్తున్న పశువులు

బిస్కెట్లు తిని జీవిస్తున్న పశువులు
x
Highlights

రానున్న కాలంలో పంటలు పండక మనిషి ఆహారం బదులు ట్యాబ్లెట్సు తిని బ్రతకాల్సి వస్తోందని ఆదిత్య 360 సినిమాలో చూశాం. ఆ పరిస్థితి ఎప్పుడొస్తుందో తెలియదుగానీ...

రానున్న కాలంలో పంటలు పండక మనిషి ఆహారం బదులు ట్యాబ్లెట్సు తిని బ్రతకాల్సి వస్తోందని ఆదిత్య 360 సినిమాలో చూశాం. ఆ పరిస్థితి ఎప్పుడొస్తుందో తెలియదుగానీ ఇప్పుడు పశువులు బిస్కెట్లు తిని జీవిస్తున్నాయి. పశుగ్రాసం దొరక్క పోవడంతో చిత్తూరు జిల్లాలో ఓ రైతు పశువులకు బిస్కెట్లు పెట్టి పోషిస్తున్నారు. బిస్కెట్లే ఆ పశువులకు దాణాగా మారింది.

పశుగ్రాసం దొరక్కపోవడంతో ఈ పశువులు బిస్కెట్లను తిని జీవిస్తున్నాయి. చిత్తూరు జిల్లా తంబలపల్లె మండలం ఎద్దుల వారి కోటకు చెందిన రెడ్డప్పకు ఐదెకరాల పొలం ఉంది. పది పశువులు ఉన్నాయి. నీరు లేక సరిగా పంటలు పండకపోవడంతో పశువులను పెంచుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒక రోజు పశువులకు పశుగ్రాసం దొరక్కపోవడంతో రెడ్డప్ప దాణాగా బిస్కెట్లను వేశారు. ఆకలితో ఉన్న పశువులు బిస్కెట్లను తినేశాయి. ఏడాది నుంచి బిస్కెట్లు తినే జీవిస్తున్నాయి.

ఫ్యాక్టరీలో ఒక్క కిలో బిస్కెట్ 20 రూపాయల చొప్పున కొంటున్నారు రెడ్డప్ప. ఒక్కో రోజుకు ఒక్కో పశువుకు ఐదు నుంచి ఆరు కిలోల బిస్కెట్లు అవసరమవుతాయి. బిస్కెట్లతో పాటు కొంత పిండి కలిపిన నీళ్ళు తాగిస్తున్నారు. కానీ పాల దిగుబడి తగ్గింది. ఒక్కో ఆవు కేవలం 10 లీటర్ల పాలు ఇవ్వడంపై రెడ్డప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశువులకు బిస్కెట్లు పెట్టడం ప్రమాదకరమంటున్నారు పశువైద్యులు. కొద్ది రోజులకు పాలదిగుబడి తగ్గిపోవడంతోపాటు పశువుల ఆరోగ్యానికి కూడా హానికరమంటున్నారు. పట్టణాల్లో ఆలనా పాలనా లేని ఆవులు పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు తింటుంటే పశువులను పోషిస్తున్న రైతు బిస్కెట్లు పెట్టి పోషించాల్సిన దుస్థితి రావడం విచారకరం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories