Harshit Rana-BCCI: ఒక్క మ్యాచ్ ఆడని హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు.. షమీ బాధపడుతాడు కదా!
Sadagoppan Ramesh Slams BCCI. శస్త్రచికిత్స తర్వాత హర్షిత్‌ను నేరుగా భారత జట్టులోకి ఎలా తీసుకుంటారని మాజీలు బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు.
Harshit Rana-BCCI: ఒక్క మ్యాచ్ ఆడని హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు.. షమీ బాధపడుతాడు కదా!
Harshit Rana-BCCI: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌కు తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూడు సిరీస్‌లకు పేసర్ హర్షిత్ రాణాను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దాంతో సెలక్షన్ కమిటీపై సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత హర్షిత్‌ను నేరుగా భారత జట్టులోకి ఎలా తీసుకుంటారని ఫాన్స్, మాజీలు బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఒక్క దేశవాళీ మ్యాచ్ ఆడని అతడిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని మండిపడుతున్నారు.
తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ శఠగోపన్ రమేశ్ సైతం హర్షిత్ రాణా ఎంపికను తప్పుపట్టారు. ఈ విషయమై ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. బీసీసీఐ సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. 'మీరు హర్షిత్ రాణాను అసలు జట్టులోకి ఎలా ఎంపిక చేస్తారు?. మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతడు కనీసం ఒక్క దేశవాళీ మ్యాచ్ అయినా ఆడినట్లు నాకైతే తెలియదు. ఈ విచిత్రమైన నిర్ణయానికి ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. జట్టులో కోసం వేచి చూస్తున్న మహ్మద్ షమీ, మిగతా సీనియర్ ఆటగాళ్ల మైండ్ వాయిస్‌ను ఒక్కసారి ఊహించుకోండి' అని రమేశ్ బీసీసీఐ సెలెక్టర్లపై మండిపడ్డారు. ఐపీఎల్ 2026లో స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ 28 వికెట్లతో సత్తా చాటిన విషయం తెలిసిందే. అయినా అతడికి చోటు దక్కలేదు. ఇటీవలి కాలంలో ఒక్క మ్యాచ్ ఆడని హర్షిత్.. ఏకంగా మూడు సిరీస్‌లలో చోటు దక్కించుకున్నాడు.
జట్టులో అందరికీ ఒకే న్యాయం ఉండాలని గుర్తు చేస్తూ శఠగోపన్ రమేశ్ గతంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. 'అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ స్వయంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకే తేల్చి చెప్పింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనపుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని అల్టిమేటం జారీ చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకున్న తర్వాత జాతీయ జట్టులోకి వచ్చే ముందు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి వచ్చింది. అలాగే సీనియర్ పేసర్ మహ్మద్ షమీని కూడా లాంగ్ స్పెల్స్ వేసే విషయంలో ఫిట్‌నెస్ నిరూపించుకోమన్నారు? కదా' అని బీసీసీఐని రమేశ్ ప్రశ్నించారు.
గాయం తర్వాత జట్టులోకి వచ్చే ఆటగాళ్లకు బీసీసీఐ స్వయంగా పెట్టిన నిబంధనలను శఠగోపన్ రమేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను సైతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లకు ముందు విజయ్ హజారే ట్రోఫీ ఆడి తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని బోర్డు ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఉదాహరణలు భారత క్రికెట్‌లో ఇంకా చాలా ఉన్నాయని.. ఒక ఆటగాడు గాయం తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే ఖచ్చితంగా ఫిట్‌నెస్ ప్రూవ్ చేసుకోవాలనే నిబంధనను తీసుకువచ్చిన సెలక్టర్లు.. ఇప్పుడు హర్షిత్ రాణా విషయంలో ఆ రూల్‌ను ఎలా బ్రేక్ చేస్తారని మాజీ ఓపెనర్ శఠగోపన్ రమేశ్ నిలదీశారు. మిగతా వాళ్లకు ఓ రూల్.. హర్షిత్‌కు ,మరో రూల్ పెట్టడం తప్పు కాదా? అని విమర్శలు చేశారు.