Giddalur: సీఎం చంద్రబాబు చిత్రపటానికి మత్స్యకారుల ఘన పాలాభిషేకం!
Giddalur: కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సాయం అందించడంపై గిద్దలూరు నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
Giddalur: సీఎం చంద్రబాబు చిత్రపటానికి మత్స్యకారుల ఘన పాలాభిషేకం!
గిద్దలూరు: కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయం పై గిద్దలూరు నియోజకవర్గ మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మత్స్యకారులు గురువారం రాత్రి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు.
మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలనే సంకల్పంతో ప్రభుత్వం మత్స్యకార లబ్ధిదారులకు రూ. 20,000 ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా ఈ కృతజ్ఞతా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేటపైనే ఆధారపడి జీవించే తమకు ఈ సాయం ఎంతో ఊరటనిచ్చిందని, తమ కుటుంబాల్లో వెలుగులు నింపిందని మత్స్యకారులు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు. లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చి, సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి కష్టాలను గుర్తించి, ఆర్థికంగా ఆదుకోవడానికి రూ. 20,000 ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారులకు అందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు నియోజకవర్గ మత్స్యకారులు పాల్గొన్నారు.