కాసేపట్లో భారత్ విండీస్ ఫైనల్ పోరు.. బలాబలాలు ఇవే..

కాసేపట్లో ఇండియా వెస్టిండీస్ మధ్య ఫైనల్ సమరం ఆరంభంకానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టైటిల్ ఎగరేసుకుపోనుంది.

Update: 2019-12-11 10:16 GMT
ind vs wi

టీమిండియా విండీస్ మధ్య జరుగుతున్నమూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్ గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లే కాకుండా అభిమానులు సైతం ఉఠ్కంగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే జరిగిన రెండు టీ20ల్లో రెండు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమానంగా నిలిచాయి. అయితే గురువారం జరగనున్న మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు టైటిల్ కైవసం చేసుకుంటుంది. వాంఖడేలో మొదట ఫీల్డింగే ఎంచుకునే జట్టు భారీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకునే అవకాశం ఉంది.

ఇప్పటి వరకూ రెండు మ్యాచ్లో జరిగిన విశేషాలు చూస్టే.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ బ్యాట్స్ మెన్ భారీగా పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో సిక్సర్ల వర్షం కురింపించారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. మొత్తం 27 సిక్సర్లు బాదారు.

ముంబై రోహిత్‌ శర్మ సొంతరాష్ట్రం కావడంతో ఈ మ్యాచ్ లో రోహిత్ మెరుపులు మెరిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్‌కుపైగా ఈ మైదానంలో ఆడిన అనుభవం కూడా ఉండడంతో విధ్వంసర ఇన్నింగ్స్ ఆడితే టీమిండియా విజయం సులువవుతుంది. ఉప్పల్, తిరువనంతపురంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ నిరాశపరిచాడు. 8పరుగులు తొలి మ్యాచ్‌లో సాధిస్తే రెండో మ్యాచ్ లో 15 పరుగుల చేసి నిరాశపరిచాడు. తొలి టీ20లో అర్థశతకంతో రాహుల్‌ రాణించాడు. అదే ఊపు ఈ మ్యాచ్ లో కొనసాగిచి శుభారంభం అందిస్తే విజయం సులువతుంది. ఉప్పల్ టీ20లో విధ్వంస ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఈ మ్యాచ్ లో రాణించాల్సిన అవసరం ఉంది.

వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ విఫలమతు ఉన్నాడు. అతని ఫామ్ పై సీనియర్లు విమర్శలు కురిపిస్తున్నారు. అతని స్థానంలో సంజూ సామ్సన్ ఆడించాలని పట్టుబడుతున్నారు. అయినప్పటీకీ పంత్ పై కోహ్లీ నమ్మకముంచడంతో సంజూ సామ్సన్‌కు తుది జట్టులో ఆడే చాన్స్‌ లేదు. శివమ్‌ దూబే ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. ఫిల్డింగ్ వైఫల్యం కూడా భారత్‌ను కలవరపెడుతుంది.

విండీస్ సారథి పొలార్డ్ కు ముంబైలో ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున వాంఖడే పిచ్ మంచి అవగాహన ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. విండీస్ టాపార్డర్‌లో సిమన్స్, లూయిస్‌ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. హెట్‌మైర్, నికోలస్‌ పూరన్‌ రాణిస్తుండడంతో బ్యాటింగ్ ఆర్దర్ బలంగా ఉంది. బౌలర్లలో హోల్డర్, లెగ్‌ స్పిన్నర్‌ హేడెన్‌ వాల్ష్ టీమిండియాపై రెండో టీ20లో పరుగులు చేయనియకుండా కట్టడి చేయగలిగారు. విండీస్ ఫిల్డింగ్ అద్భుతంగా ఉంది.

వాంఖెడేలో మూడు టీ20లు ఆడిన భారత్ రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. చివరిగా టీమిండియా మార్చి 31న, 2016లో టీ20లో విండీస్‌ చేతిలో 7 వికెట్లతో ఓటమి చెందింది.

జట్ల అంచనా

భారత్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శివమ్‌ దూబే, రాహుల్, పంత్, శ్రేయస్, వాషింగ్టన్‌ సుందర్, జడేజా, భువనేశ్వర్, దీపక్‌ చాహర్, చహల్‌.

వెస్టిండీస్‌: కీరన్‌ పొలార్డ్‌ (కెపె్టన్‌), లూయిస్, లెండిల్‌ సిమన్స్, నికోలస్‌ పూరన్, కింగ్, హెట్‌మైర్, జేసన్‌ హోల్డర్, కాట్రెల్, పియరీ, విలియమ్స్, హేడెన్‌ వాల్ష్ .

Tags:    

Similar News