రామమందిర నిర్మాణంపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
అయోధ్య రామమందిరం నిర్మాణంపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య రామమందిరం నిర్మాణంపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో ఆకాశాన్ని అతి పెద్ద రామ మందిరం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.రామ మందిర నిర్మాణ పనులు 4 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పారు. జార్ఖండ్‌లో ఐదో దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాకుర్‌లో అమిత్ షా ప్రసంగించారు. అయోధ్య రామమందిరం అంశంపై సుప్రీంకోర్టు తీరు ఇచ్చింది. ఇప్పుడు కేవలం 4నెలల్లోనే అతి పెద్ద రామమందిరం నిర్మిస్తాం అని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెన్‌లో రామ మందిరం నిర్మాణాన్ని అడ్డుకుంది. కోర్టుల్లో కేసులు వేసి నిలిపివేసిందని అన్నారు. దేశాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని, ప్రజల మనోభావాలను గౌరవించలేదని ఆరోపించారు.
దశాబ్దాలుగా నెలకొన్న వివాదాస్పద స్థలం అయోధ్య భూవివాదంపై నవంబర్ 17న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. వివాదాస్సదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిలో రామమందిరం నిర్మించాలని గోగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. అలాగే, మసీదు నిర్మాణం కోసం కూడా స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, మూడు నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు చేసి రామమందిరం నిర్మాణం చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన 2 రోజుల్లోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రామమందిరం పనులు సమీక్షించేందుకు ఓ ట్రన్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది.
జార్ఖండ్‌లో ఎన్నికల సందర్బంగా మాట్లాడిన అమిత్ షా. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కశ్మీర్ గురించి జార్ఖండ్ లో ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారని, అధికరణ 370 రద్దుతో కశ్మీర్ భారత్‌లో భూబాగంలో ఉంది. కశ్మీర్‌ను భారత్‌లో కలపడం ఇష్టం లేదా అని అమిత్ షా ప్రశ్నించారు.