చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్నత విద్యావంతులు.. మంత్రివర్గంలో డాక్టరేట్లు, మాస్టర్స్ డిగ్రీ, లాయర్లు, ఇంజినీర్లు
AP Cabinet Ministers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో వైద్య, న్యాయ పట్టభద్రులతోపాటు ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారూ అధికంగా ఉన్నారు.
సీఎం చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్నత విద్యావంతులు.. మంత్రివర్గంలో డాక్టరేట్లు, మాస్టర్స్ డిగ్రీ, లాయర్లు, ఇంజినీర్లు
AP Cabinet Ministers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో వైద్య, న్యాయ పట్టభద్రులతోపాటు ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, పీహెచ్‌డీ చేసిన వారూ అధికంగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం వెనుకబాటుతనానికి గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యానికి ఈ ప్రభుత్వంలో కూడా ఎక్కడా ఇబ్బంది కాకుండా మొహమాటాలకు తావివ్వకుండా సీనియర్లను సైతం పక్కనపెట్టి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన క్యాబినెట్లో చంద్రబాబు విద్యావంతులకు పెద్దపీట వేశారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుంచి మంత్రి అయిన కందుల దుర్గేష్‌కు కూడా ఎంఏ ఎకనామిక్స్ చేశారు. బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. నారా లోకేశ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్ బ్రిటన్‌లో ఎంబీఏ చదివారు. కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో ఎంఎస్ చేశారు. నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్ ఇక్కడే వ్యాపార నిర్వహణలో మాస్టర్స్ చేశారు. గొట్టిపాటి రవికుమార్ ఇంజినీరింగ్ చదివారు. డోలా బాలవీరాంజనేయస్వామి వైద్య విద్యనభ్యసించారు. మండిపల్లి రాంప్రసాద రెడ్డి బీడీఎస్ చదువు మధ్యలో ఆపేశారు. నిమ్మల రామానాయుడు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు.
ఆనం రామనారాయణరెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర న్యాయవిద్య పూర్తి చేశారు. కొండపల్లి శ్రీనివాస్ యూఎస్‌లో ఎంఎస్ చదవగా పి.నారాయణ, వంగలపూడి అనిత పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సవిత, సంధ్యారాణి, బీసీ జనార్దనరెడ్డి, కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ డిగ్రీ చదివారు. అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేశారు. క్యాబినెట్ మొత్తం మీద తక్కువ విద్యను అభ్యసించింది పవన్ కల్యాణ్, ఎన్‌ఎండీ ఫరూక్ మాత్రమే వీరిద్దరూ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. పవన్ కల్యాణ్ ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ పూర్తి చేశారు.