యూజీసీ నెట్ - 2019 నోటిఫికేషన్ వచ్చేసింది

యూజీసీ నెట్ - 2019 నోటిఫికేషన్ వచ్చేసింది
x
Highlights

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు) - 2019 నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు) - 2019 నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది.

అర్హతలు ఇవే..

- కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. (పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు)

- ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే చాలు.

దఖాస్తులు ఎలా?

- ఆన్లైన్ ద్వారా దఖాస్తూ చేసుకోవాల్సి ఉంటుంది.

- సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు అక్టోబర్ 10 వరకూ కట్టవచ్చు.

- దరఖాస్తు ఫీజు.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 1000 రూపాయలు, ఓబీసీ లకు 500 రూపాయలు, ఎస్సీ,ఎస్టి, దివ్యాంగులు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

పరీక్షలు నిర్వహించే తేదీలు.. డిసెంబర్ 2 నుంచి 6 వరకూ.

పరీక్ష ఇలా ఉంటుంది..

- ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటలు మొత్తం రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.

- పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

- ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.

- ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలివే!

- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019 - ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.09.2019 - దరఖాస్తుల సవరణకు అవకాశం: 18 - 25.10.2019 వరకు. - అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: 09.11.2019 - నెట్ పరీక్ష తేదీలు: డిసెంబరు 2 - 6 వరకు. - ఫలితాల వెల్లడి: 31.12.2019

పూర్తి వివరాలు దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories