యువరాజ్ సింగ్ కు క్యాన్సర్: తేల్చిచెప్పిన బోస్టన్ లోని క్యాన్సర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వైద్యులు
భారత క్రికెట్ అభిమానులకు ఇది తీవ్రంగా బాధించే విషయం. టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ కు కాన్సర్ ఉందని తేలింది. ఎడమవైపు ఊపిరితిత్తిలో ట్యూమర్ ను గుర్తించారు. ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన యూవీ ఆ తర్వాత అనారోగ్యంతో క్రికెట్ కు దూరంగా ఉన్నారు. గత అక్టోబర్ లో గుండెకు, ఊపిరితిత్తులకు మధ్య కణితిని గుర్తించిన భారత వైద్యులు యూవీకి శస్త్రచికిత్స చేశారు.
ఆపరేషన్ తర్వాత కూడా మరోసారి ఊపిరితిత్తుల్లో కణితి ఏర్పడటంతో గత నెలలో ఆయన అమెరికా వెళ్లారు. బోస్టన్ క్యాన్సెర్ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు కణితి క్యాన్సర్ అని తేల్చిచెప్పారు. మూడు దశల్లో యువరాజ్ కు కీమీథెరిఫీ చికిత్సలు మార్చి నాటికి పూర్తి కానున్నాయి. ఏప్రిల్ లో తగిన విశ్రాంతి తీసుకుని మేకల్లా తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి వెళ్తారని వైద్యులు భరోసా ఇస్తున్నారు. యూవీ క్యాన్సర్ మొదటి దశలోనే ఉన్నందున ఆందోళ చెందవలసిన అవసరం లేదని యూవీ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ జతిన్ చౌదరి అన్నారు.
ఇటు బీసీసీఐ, టీమిండియా సహచరులు సైతం యూవీ త్వరగా కోలుకుని భారత క్రికెట్ కు మరిన్ని సేవలందించాలని ఆశిస్తున్నారు. క్రీడారంగంలో ఎంతో మంది ఇప్పటి వరకూ కాన్సర్ మహమ్మారిపై విజయం సాధించారు. కేన్సర్ అనగానే క్రీడాభిమానులకు సైక్లింగ్ స్టార్ లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ గుర్తొస్తారు. ప్రమాదకరమైన క్యాన్సర్ ను జయించి టూర్ డి ఫ్రాన్స్ లో పాల్గొన్న ఘన ఆర్మ్ స్ట్రాంగ్ దే.
ఆర్మ్ స్ట్రాంగ్ స్ఫూర్తి క్రికెట్ అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని భారత్ క్రెకిట్ క్రీడారంగానికి తనవంతు సేవలందిస్తానని యువరాజ్ అన్నారు. యువరాజ్ త్వరగా కోలుకోవాలని మళ్లీ తన ఆల్ రౌండర్ ప్రతిభతో క్రికెట్ కు విశిష్ట సేవలందించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.