Next


లైఫ్ స్టైల్

పాపికొండల విహారానికి తాత్కాలికంగా బ్రేకు

 గోదావరిలో విహారించలనుకునే పర్యటకులకు అధికారులు బ్రేకులు వేశారు. నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో...బోట్లు నడపవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా... పాపికొండల్లో సరదాగా గడపాలని టిక్కెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది పర్యాటకులకు అధికారుల నిర్ణయం నిరాశను మిగిల్చింది. లాంచీలు తిరిగేందుకు గోదావరిలో నీటి ప్రవాహం సరిపోయే దశలో వున్నా హైటెక్ బోట్లతో పాటు లాంచీలను కూడా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో బోట్లు, లాంచీ యజమానులు కూడా సందిగ్ధంలో పడ్డారు. 

ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో తగ్గడం... ఉన్న నీరు దాళ్వా నాట్లుకు విడుదల చేయడంతో నీటిమట్టం క్రమేపీ పడిపోతుండటంతో బోట్లకు ఇసుకమేటలు తగులుతున్నాయి. రానున్న నాలుగు  రోజులూ ఈ పరిస్థితి మరింత కష్టంగా  వుండే అవకాశాలు వున్నాయి. జనవరి రెండో తేదీ తర్వాత సీలేరు జలాలు గోదావరిలోకి విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. ఈ జలాలు విడుదలైతే గోదావరి నీటిమట్టం పెరుగుతుందని, అంతేకాకుండా  బోట్ల ప్రయాణానికి మరి కొద్దిరోజులు ఇబ్బంది రాకపోవచ్చునని అధికారులు చెబుతున్నారు.
 
ఇప్పటికే పురుషోత్తపట్నం, దేవీపట్నం ప్రాంతాలలో బోట్లకు ఇసుక మేటలు తగులుతుండటంతో... బోట్లు నిలిపివేయడమే మంచిదని హైటెక్ బోట్ల యజమానులు చెబుతున్నారు. పురుషోత్తపట్నం వద్ద బోట్లన్ని నిలిపివేయడానికి నిర్ణయించి అక్కడే లంగర్లు వేశారు. ప్రతి రోజూ పట్టిసీమ, పురుషోత్తపట్నం, రాజమండ్రి ల నుంచి బోట్లు, లాంచీలు కలిపి 30 వరకూ ప్రయాణం చేస్తున్నాయి.
గోదావరిలో నీటిప్రవాహం తగ్గడంతో పాపికొండల విహారానికి తాత్కాలికంగా బ్రేకు పడింది. ఈనెల 29వ తేదీ నుంచి జనవరి రెండో తేదీ వరకూ బోట్లు నడపవద్దని...వాటి యజమానులకు ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో పాపికొండలకు వెళ్లే ప్రైవేట్, విహార బోట్లు, ప్రైవేట్ లాంచీలు ఈ ఉదయం నుంచి నిలిపివేశారు.
అది పుడమి తల్లి అందాలన్నీ పొత్తిళ్లలో పొదివి పట్టుకున్న జిల్లా... అక్కడ కొండ కోనలుంటాయి.. జాలువారే జలపాతాలుంటాయి. వయ్యారంగా నడిచి వెళ్లే నడక నేర్చిన నదులుంటాయి. శిధిలాలను ముద్రించుకున్న చారిత్రక ఆధారాలుంటాయి. చిరకాలం నిలిచిపోయే శిలాశాసనాలుంటాయి. అవతారపురుషుడు నడయాడిన నేల ఇది.. భూత భవిష్యత్ వర్తమానాలను వివరించే కాలజ్ఞానం పుట్టిందీ కూడా ఇక్కడే.. ఇన్ని ప్రత్యేకతలున్న ఒకే ఒక జిల్లా కర్నూలు.. కనువిందు చేసే కర్నూలు అందాల పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
లడఖ్ లో పర్యాటకులు ఒంటెపై సవారీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సముద్ర మట్టానికి పది వేల అడుగున ఎత్తున్న నుబ్రా పర్వత సాణువుల్లో లొట్టిపిట్టపై సవారీ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
ఇంతకీ మానస సరోవర యాత్రకి వెళ్లడమంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవడమేనా..? ఆ యాత్ర విశేషాలేమిటి? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది..?
కళాపోషనుంటే దేన్నైనా వినూత్నంగా ప్రదర్శించవచ్చని నిరూపిస్తున్నారు తమిళనాడులోని ప్రూట్ లవర్స్. వివిధ రకాల పళ్లను ప్రదర్శనలో పెట్టి పర్యటకులను ఆకర్షిస్తున్నారు.