Next


జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లాలో హడలెత్తిస్తున్న ఎసిబి అధికారులు

    ప్రకాశం జిల్లాలో ఎసిబి అధికారులు హడలెత్తిస్తున్నారు. అధికారుల దెబ్బకు మద్యం వ్యాపారులు వణికిపోతున్నారు. పదిరోజుల క్రిత సింగరాయకొండ ఎక్సైజ్  సిఐ గురవయ్యతోపాటు ఒంగోలు మద్యం సిండికేట్ వ్యాపారి వెంకటరావు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో జిల్లాలోని మద్యం వ్యాపారలు భయాందోళనకు గురయ్యారు.

నందినాటకోత్సవాల కోసం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరం ముస్తాబవుతోంది. ఈ నెల 5నుంచి 9రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు.
ఆటోను ఆపకుండా వెళుతున్నాడన్న కారణంగా గుంటూరు జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ ను పోలీసులు చితకబాదారు. గాయాలపాలైన డ్రైవర్ చికిత్స పొందుతూ మరణించాడు.
ఏదైనా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారంటే ఆ గ్రామస్థులు సంతోషపడతారు. తమ కష్టాలు తీరుతున్నాయంటూ ఆనందపడతారు. అయితే గుంటూరు జిల్లా మంగళగిరి వాసులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శానిటరీ పనులు చేపట్టినప్పటి నుంచి దోమల దాడి ఎక్కువై రోగాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో తెలుసుకోవాలంటే.. మంగళగిరి వెళ్లాల్సిందే.
ఏదైనా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారంటే ఆ గ్రామస్థులు సంతోషపడతారు. తమ కష్టాలు తీరుతున్నాయంటూ ఆనందపడతారు. అయితే గుంటూరు జిల్లా మంగళగిరి వాసులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శానిటరీ పనులు చేపట్టినప్పటి నుంచి దోమల దాడి ఎక్కువై రోగాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో తెలుసుకోవాలంటే మంగళగిరి వెళ్లాల్సిందే.
గుంటూరు జిల్లాలో అన్నాసారె కుగ్లర్ నిర్మించిన ఆస్పత్రి సమస్యలతో సతమతమువుతోంది. రాష్ట్ర ప్రజలకు విశిష్టమైన సేవలందించిన ఈ ఆస్పత్రి వివాదాలతో కొట్టుమిట్టాడుతోంది. 1982లో నిర్మించిన ఈ ఆస్పత్రిని కారుణ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ లీజుకు తీసుకుంది. ఆస్పత్రి ఆరంభం నుంచే లూథరన్ చర్చ్ ప్రార్థనలు నిర్వహించేది. అయితే ఆస్పత్రిలో కారుణ్య సంస్థ ప్రార్థనలు నిర్వహించేందుకు క్రైస్తవ సోదరులకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు రోడ్లపైనే ప్రార్థనలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.