Next


ఈ రోజు ప్రశ్న
అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయకుట్ర ఉందని భావిస్తున్నారా..?
a. అవును
b. కాదు

    

Result Charts: Pie, Vertical Bar
HMTV
వినోదం
Photo

బాలీవుడ్ లో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న అగ్నిపథ్ సినిమా

    1990లో అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా అగ్నిపథ్.. ఈ సినిమాలో బిగ్ బీ డాన్ పాత్రలో ఒదిగిపోయారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నటనకుగాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. చిత్రంలోని డైలాగులు ప్రేక్షకులన్ని ఎప్పటికి గుర్తుండిపోయేలా చేశాయి. ఇపుడు అదే సినిమా.. కాకపోతే నటీనటులు మరారు. ఫలితం.. నిర్మాతలకు కాసుల సునామీ. అగ్నిపథ్ లో సంజయ్ దత్ గెటప్పే సినిమాకు హైలెట్. అంతేకాకుండా నటనతోనూ మైమరిపించారు.

   సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్  సినిమా పేరిట ఉన్న రికార్డులను అగ్నిపథ్ బద్దలు కొట్టింది. బాడీగార్డు సినిమా తొలి రోజు 21కోట్లు వసూలు చేస్తే, అగ్నిపథ్ 24కోట్ల రూపాయలను వసూలు చేసింది. హృతిక్ రోషన్ నటన, ప్రియాంక చోప్రా అందాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా కత్రినా కైఫ్ మరోసారి ప్రత్యేక గీతంతో రెచ్చిపోయింది. చిక్నీ ఛమేలీ అంటూ ప్రేక్షకులను ఊర్రుతలూగించింది.

HMTV
అగ్నిపథ్.. బాలీవుడ్ లో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న సినిమా. విడుదలైన మొదటి రోజే బాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను నెలకొల్పింది. సంజయ్ దత్ విలనిజం, హృతిక్ రోషన్ హీరోయిజం, ప్రియాంక చోప్రా అందాలు సినిమాకు కలసివచ్చాయి.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ వీరవిహారం చేస్తోంది. ఒక్క ఓటమి కూడా లేకుండా విజయ పరంపర కొనసాగిస్తోంది. సెమీఫైనల్ కు ముందు చెన్నై రైనోస్ ను మట్టికరిపించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
జెనిలీయా, రితేష్ దేశ్ ముఖ్ ల రిసెప్షన్ ముంబైలో వైభవంగా జరిగింది. ముంబయి శివారులోని బాంద్రాలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు.
జైతెలంగాణ చిత్రానికి తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం విడుదల సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని పలు థియేటర్లు సందడిగా మారాయి. పలుథియేటర్ల ముందు ప్రేక్షకులు టపాకాయలు పేల్చి నినాదాలు చేశారు.
అంగవైకల్యాన్ని అధిగమించి అనూహ్య విజయాలు సాధించే వారిని ప్రోత్సహించటం మనందరి బాధ్యత అని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. చెన్నైలో కెవిన్ కేర్ అబిలిటీ అవార్డుల ఎంపికలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.