లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండడంతో దేశీయ మార్కెట్ల సెంటీమెంట్ పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు.
ఎల్ అండ్ టీ, రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ వంటి హెవీవెయిటేజీ షేర్ల కొనుగోళ్లు మార్కెట్ లాభాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 170పాయింట్లు లాభంతో 17755పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా, నిఫ్టీ 43పాయింట్ల లాభంతో 5369పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.