Next


జాబ్ పాయింట్
జాబ్ పాయింట్

ఇంజనీరింగ్ పై విద్యార్ధులకు మోజు తగ్గిందా..?

    ఇంజనీరింగ్ పై విద్యార్ధులకు మోజు తగ్గిందా? ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఇంజనీరింగ్  విద్యార్థులు భయపడుతున్నారా..? కోర్సులో చేరేందుకు విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారా..? గత రెండేళ్లుగా ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీ చూస్తుంటే అనుమానాలు నిజమే అనిపిస్తోంది. ఓ వైపు సీట్లు భర్తీ కాక ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు తలలు పట్టుకుంటుంటే మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంజనీరింగ్ విద్యపై రాష్ట్రంలో ఆదరణ తగ్గిపోతోంది. అనుకున్నట్టుగానే ఈ యేడూ ఇంజనీరింగ్ సీట్లు కుప్పలు తెప్పలుగా మిగిలిపోయాయి. గతేడాది 74వేల ఇంజనీరింగ్  సీట్లు మిగిలిపోతే ఈ సంవత్సరం తొలిదశ కౌన్సిలింగ్ పూర్తయి అలాట్ మెంట్ జరిగిన తర్వాత కన్వీనర్  కోటాలోనే 78వేల 596సీట్లు భర్తీకి నోచుకోలేదు. ఇంజనీరింగ్  కాలేజీలు కుప్పలుతెప్పలుగా పెరిగిపోవడంతో  సీట్లు భారీగా మిగిలిపోయి పరిస్థితి దయనీయమైంది. ప్రవేశాల సరళిని పరిశీలిస్తే బీఫార్మసీ కోర్సుపై ఎంపీసీ విభాగం అభ్యర్థులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. బీఫార్మసీలో ఎంపీసీ విభాగం అభ్యర్థులకు కన్వీనర్ కోటాలో 9,373సీట్లు ఉండగా ఇందులో 779సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 8,594 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో గత పన్నెండేళ్ళలో ఇంజినీరింగ్ విద్య ఆశ్చర్యకరంగా వృద్ధి చెందింది. 1999లో 102ఇంజినీరింగ్ కళాశాలలు, 25వేల సీట్లుంటే పన్నెండేళ్ళు గడిచేసరికి కాలేజీల సంఖ్య ఏడురెట్లు పెరిగి 707కు చేరింది. అలాగే సీట్ల సంఖ్య కూడా 25వేల నుంచి సుమారు మూడు లక్షల 15వేలకు చేరింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చి ఇంజినీరింగ్ వైపు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. యేడాది 3లక్షల 16వేల 440ఇంజనీరింగ్  సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 2లక్షల 10వేలమంది విద్యార్థులు మాత్రమే ఎంసెట్ లో అర్హత సాధించారు. 

  దీంతో ఈ యేడాది లక్షా 20వేలకు పైనే ఇంజనీరింగ్  సీట్లు మిగిలిపోనున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలకు కుప్పలు తెప్పలుగా అనుమతులు ఇవ్వడంతో అధ్యాపకుల కొరత ఎక్కువై విద్యాప్రమాణాలు దిగజారాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ విద్యలో మార్కెట్ కు అవసరమైన కోర్సులను అందించడంలో చాలా ఇంజనీరింగ్  కళాశాలలు విఫలం చెందుతుండడంతో సీట్ల భర్తీ కావట్లేదనే వాదనా ఉంది. ప్రమాణాల క్షీణత, అర్హులైన సిబ్బంది కొరత, ఫీజు రీయంబర్స్ మెంట్ , రాష్ట్ర విభజన ఉద్యమం... విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఆధారపడిన కాలేజ్  యాజమాన్యాలు సీట్లు భర్తీకాక మల్లగుల్లాలు పడుతున్నాయి. విద్యార్ధులు లేకపోతే ఈ ఏడాదికి కాలేజీలను మూసుకోవచ్చని యాజమాన్యాలు యోచిస్తున్నాయి.

ఇంజనీరింగ్ పై విద్యార్ధులకు మోజు తగ్గిందా? ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఇంజనీరింగ్ విద్యార్థులు భయపడుతున్నారా..? కోర్సులో చేరేందుకు విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారా..? గత రెండేళ్లుగా ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీ చూస్తుంటే అనుమానాలు నిజమే అనిపిస్తోంది. ఓ వైపు సీట్లు భర్తీ కాక ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు తలలు పట్టుకుంటుంటే మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గ్రాడ్యుయేషన్ లు, పిజిలు పూర్తిచేసి చేతులు కట్టుకుని కూర్చుంటే జాబ్‌ మనల్ని వెతుక్కుంటూ రాదు.