నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

Winter Session of Parliament to Begin Today
x

నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

Highlights

Parliament Winter Session 2023: ఈనెల 22 వరకు పార్లమెంటు సమావేశాలు

Parliament Winter Session 2023: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 22 వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 24 బిల్లులు సభ ముందుకురానున్నాయి. ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానంలో కొత్త బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ప్రెస్‌- పీరియాడికల్స్‌ బిల్లుపై చర్చ జరగనుంది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో సీజేఐ ప్రమేయం లేకుండా... అమలు చేసే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. టీఎంసీ ఎంపీ మహువాపై.. ఎథిక్స్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇక దేశంలో నెలకొన్న పలు సమస్యలపై చర్చకు విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. సమావేశాలపై 5 రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఉండనుంది. రిజల్ట్స్‌పై బీజేపీ ధీమాగా ఉండగా..ఇండియా కూటమి డీలా పడింది. ఈనెల 6న ఇండియా కూటమి సమావేశంకానుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories