కేకేకు ఇప్పుడో కొత్త చిక్కు.. కేకేకు ఎదురైన ఆ చేదు అనుభవం ఏంటి?

కేకేకు ఇప్పుడో కొత్త చిక్కు.. కేకేకు ఎదురైన ఆ చేదు అనుభవం ఏంటి?
x
కేకేకు ఎదురైన ఆ చేదు అనుభవం ఏంటి?
Highlights

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే అందులో ఒకటి కె.కేశవరావు ఉరఫ్‌ కేకే. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరిన కేకేకు ఇప్పుడో...

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే అందులో ఒకటి కె.కేశవరావు ఉరఫ్‌ కేకే. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరిన కేకేకు ఇప్పుడో చిక్కొచ్చిపడింది. అంతా అనుకున్నట్టే జరుగుతుందని అనుకుంటున్న ఈ సమయంలో కేకేకు ఎదురైన ఆ చేదు అనుభవం ఏంటి?

రాజ్యసభ సభ్యుడు కేకేకు ఇప్పడో చిక్కొచ్చి పడింది. ఏప్రిల్‌ 9వ తేదీన ఆయన రాజ్యసభ సభ్యత్వానికి పదవీ విరమణ చేయనున్నారు. అయితే 2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎంపికైన కేకే ఇప్పుడు ఏపీ నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. దీనికి తోడు ఇటీవల తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియోగా ఆయన ఓటేశారు. తెలంగాణ సభ్యత్వం ఉన్న వాళ్లే అది ఉపయోగించుకోవాలి. తాను ఉంటుంది తెలంగాణలోనే కాబట్టి ఓటు హక్కు వినియోగించుకున్నానని అప్పట్లో చెప్పారు.

కానీ తాజా నోటిఫికేషన్‌లో కేకే ఏపీ నుంచే ప్రాతినథ్యం వహిస్తూన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో వివాదం మొదటికొచ్చింది. రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభ సభ్యుల కేటాయింపులో కేవీపీ తెలంగాణకు రాగా, కేకే ఏపీకి కేటాయించబడ్డారు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా కేకే ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకోవడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా కేకే ఓటు వేయడంతో బీజేపీ దక్కించుకోవాల్సిన మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ వశమైంది. దీనిపై బీజేపీ రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. అప్పుడే, కె.కేశవరావు ఏపీ కోటాలో ఉన్నారని సెక్రటరీ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. దాంతో ఏపీ కోటాలో ఉన్న కేశవరావు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫిషియో ఓటును ఎలా వినియోగించుకుంటారని బీజేపీ ప్రశ్నించడంతో పాటు ఈ అంశంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.

అయితే ఇలాంటి వివాదాలకు ఎన్నికల ట్రిబ్యునల్ ఉందని హైకోర్టు అప్పట్లో చెప్పింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. అదీకాక కేకే, ఏపీకి రాజ్యసభ సభ్యుడు అయినా అయన తెలంగాణలో ఓటేయడం వివాదాస్పదమైంది. తాను విభజన సమయంలో ఏపీకి కేటాయించినా తర్వాత తెలంగాణకే వచ్చానని కేకే చెబుతున్నారు. గెజిట్ నోటిషికేషన్ కూడా ఉందంటున్నారు. మరి తాజాగా రాజ్యసభ స్థానాల ఎంపిక, కేటాయింపు విషయంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories