TS Police Constable Exam: ఇవాళ తెలంగాణలో కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష

TSLPRB Telangana Police Constable Prelims 2022 Exam Today
x

TS Police Constable Exam: ఇవాళ తెలంగాణలో కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష

Highlights

TS Police Constable Exam: ఉదయం 10 గంటల నుంచి మ. 1 గంటల వరకు పరీక్ష

TS Police Constable Exam: కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఏర్పాట్లు చేపట్టింది. ఇక నిమిషం నిబంధనను అమలు చేస్తున్నారు.

కానిస్టేబుళ్ళ నియామక అర్హత పరీక్ష కు రంగం సిద్ధమయ్యింది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పూర్తి చేసింది. అభ్యర్థుల్ని గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఉదయం 10 గంటలకే ఠంచనుగా పరీక్ష కేంద్రం గేట్లు మూసేస్తారని మండలి వర్గాలు స్పష్టం చేశాయి.

ఈసారి 16వేల 321 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఏకంగా 6లక్షల 61వేల 196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టీ.ఎస్‌.ఎల్‌.పీ.ఆర్‌.బీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ను ఏ4సైజ్‌ పేపర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం నిర్దేశిత స్థలంలో తప్పనిసరిగా అభ్యర్థి ఫొటోను గమ్‌తో అతికించుకోవాలి. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్‌ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టొద్దు. ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు.

ఇక పరీక్షకు హాజరయ్యేవారు బయోమెట్రిక్‌ విధానం అనుసరించనున్న నేపథ్యంలో అభ్యర్థుల చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోకూడదు. అభ్యర్థి పరీక్ష గదిలోకి తనవెంట హాల్‌టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్‌ పాయింట్‌పెన్‌ను మాత్రమే తీసుకెళ్లాలి. సెల్‌ఫోన్‌, టాబ్లెట్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ డివైజ్‌, చేతిగడియారం, కాలిక్యులేటర్‌, లాగ్‌టేబుల్‌, వాలెట్‌, పర్స్‌, నోట్స్‌, చార్ట్‌, రికార్డింగ్‌ పరికరాలు, ఖాళీపేపర్లను వెంట తీసుకెళ్లరాదు.

కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కుల్ని ఈసారి కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజిక వర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ టైప్‌లో 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గిస్తారు. ఇక్కడ అర్హత సాధిస్తే తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావొచ్చు.ఇదీ గట్టెక్కితే తుది రాతపరీక్ష ఉండనుంది. ఆ పరీక్షలో మాత్రం నెగెటివ్‌ మార్కులుండవు.


Show Full Article
Print Article
Next Story
More Stories