టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!
x
Highlights

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆరెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను మంత్రులకు అప్పజెప్పారు సీఎం కేసీఆర్. వరంగల్, నల్లగొండ,...

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆరెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను మంత్రులకు అప్పజెప్పారు సీఎం కేసీఆర్. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పజెప్పారు. 2015 డిసెంబరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికైన కొండా మురళీధర్‌రావు(వరంగల్‌), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(నల్లగొండ), పట్నం నరేందర్‌రెడ్డి(రంగారెడ్డి) 2018 డిసెంబరులో రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలిచినవారి పదవీకాలం 2022 జనవరి 4 వరకు ఉంటుంది.

జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణల ఆధారంగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇక రంగారెడ్డి స్థానానికి మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కె.నవీన్‌రావు, పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తోంది. కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరే సమయంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది అధిష్టానం. దీంతో ఆయనకే ఈసారి అవకాశం దక్కేలా కనిపిస్తోంది. అలాగే వరంగల్‌ స్థానానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు, కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి. నల్లగొండ స్థానానికి సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories