కామారెడ్డిలో టెన్షన్.. టెన్షన్.. రోజురోజుకూ పెరుగుతున్న రైతు నిరసన ప్రదర్శనలు

Tension in Kamareddy | TS News
x

కామారెడ్డిలో టెన్షన్.. టెన్షన్.. రోజురోజుకూ పెరుగుతున్న రైతు నిరసన ప్రదర్శనలు

Highlights

Kamareddy: నేడు కామారెడ్డి సీఎస్ఐ చర్చి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ

Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీలో మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రద్దు కోరుతూ రైతు నిరసన ప్రదర్శనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నేడు కామారెడ్డి సీఎస్ఐ చర్చి నుంచి కలెక్టరేట్ వరకు రైతు కుటుంబ సమేతంగా భారీ ర్యాలీకి ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. పచ్చని పంట పొలాల్లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ ఏర్పాటు నిరసిస్తూ 20 రోజులుగా ఆందోళనను కొనసాగుతున్నాయి. ఇల్చిపూర్, అడ్లూర్, టెక్రియాల్, అడ్లూర్ ఎల్లారెడ్డి, లింగాపూర్ గ్రామాల రైతు కుటుంబాలతో భారీ ర్యాలీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్ మార్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ హెచ్చరించింది. నేటి ర్యాలీకి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories