Telangana: కడుదయనీయంగా మారిన సర్పంచుల పరిస్థితి

Telangana: కడుదయనీయంగా మారిన సర్పంచుల పరిస్థితి
x

Telangana: కడుదయనీయంగా మారిన సర్పంచుల పరిస్థితి

Highlights

Telangana: గ్రామాలే దేశప్రగతికి పట్టుగొమ్మలు.. భారతదేశంలో గ్రామాలకున్న ప్రత్యేకత అది.

Telangana: గ్రామాలే దేశప్రగతికి పట్టుగొమ్మలు.. భారతదేశంలో గ్రామాలకున్న ప్రత్యేకత అది. ఇక గ్రామస్థాయిలో జరిగే అభివృద్ధి పైనే అందరి దృష్టి ఉంటుంది. తెలంగాణలో గ్రామగ్రామాన పల్లె ప్రగతిని ఆవిష్కరించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరుతున్నది కానీ అదే గ్రామాల్లో ప్రగతి మాటున ప్రజాప్రతినిధులు తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా సర్పంచ్‌ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఇక రాష్ట్రంలో పల్లె ప్రగతి మాటున సర్పంచుల దుస్థితిపై హెచ్ ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్.

వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన సంఘటన ఇది. ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లె గ్రామ సర్పంచ్ అశోక్ చేపట్టిన పల్లె ప్రకృతి వనం, స్మశానవాటిక వంటి అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందాడు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఎల్కతుర్తిలో ఎమ్మెల్యే సతీష్ పాల్గొన్న సభలో ఆ కాంట్రాక్టర్ పురుగుల మందు డబ్బాతో హల్ చల్ చేశాడు.

రాజకీయంగా సర్పంచ్ పదవితో తమ ప్రస్థానం మొదలుపెడితే ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదగడం అన్నది నమ్మకం. కానీ ఇప్పుడు సర్పంచ్ అయ్యారంటే అప్పుల బాధలు తట్టుకోలేక రాజకీయమే వద్దు మొర్రో అనుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో రైతు ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాప్రతినిధుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి.

వల్లెపు అనిత వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం విశ్వనాథకాలనీ సర్పంచ్. గ్రామంలోని అభివృద్ధి పనులకు వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డు తదితర పనులు చేశారు. ఇందుకు 15 లక్షలు ఖర్చయింది. ఇప్పటి వరకూ కేవలం 2 లక్షల 30 వేల రూపాయల బిల్లులు మాత్రమే చెల్లించారని వాపోతుంది. ఇప్పటికైనా తమ బిల్లులు చెల్లించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్యే శరణ్యమంటుంది.

మేజర్ పంచాయితీలకు ఒకింత ఇబ్బందులు ఉంటే చిన్న పంచాయితీలు మాత్రం ఆర్థికంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ట్రాక్టర్ ఈఎమ్‌ఐ, డీజిల్ ఖర్చులు, డ్రైవర్, మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలు, కరెంట్ బిల్లులు, పంచాయితీ మెయింటెనెన్స్ అన్ని ఖర్చులు కలిపితే ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఎక్కువ అవుతున్నాయని స్వయంగా పంచాయితీ కార్యదర్శులే చెబుతున్నారు.

మొత్తానికి తెలంగాణ జిల్లాల్లోని గ్రామాల్లో సర్పంచుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. నిధులు విడుదల కాక విడుదలైన నిధులకు సంబంధించి చెక్కులు పాస్ అవక తెచ్చిన అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories