డేటా వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

డేటా వ్యవహారంలో  తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
x
Highlights

డేటా వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్‌(స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) ఏర్పాటు చేస్తూ...

డేటా వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్‌(స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం) ఏర్పాటు చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ ఇంచార్జిగా వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్రను నియమించారు. సిట్‌ బృందంలో సైబర్‌ క్రైం డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి, డీఎస్పీ రవికుమార్‌, ఏసీపీ శ్రీనివాస్‌, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను నియమించారు.

దీంతో ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో ఉన్న ఈ కేసు సిట్‌కు బదిలీకానుంది. కాగా సిట్ కు అప్పగించాలని సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు సంబంధించి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories