Telangana: పీఆర్సీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం

Telangana Cabinet Approved PRC for Government Contract and Outsourcing Employees
x

Telangana Cabinet:(File Image) 

Highlights

Telangana: తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Telangana: తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంతే కాకుండా రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కలపి మొత్తం 9,21,036 మందికి 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. తాజాగా దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్‌ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 1.4.2020 నుంచి., క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. పెన్షనర్లకు 1-4-2020 నుంచి 31-5-2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్ఆర్ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories