Hyderabad: హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని కాలేజీలో హిజాబ్ వివాదం..

Students Forced To Remove Burqa While Writing Exam in Santosh Nagar Of Hyderabad
x

Hyderabad: హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని కాలేజీలో హిజాబ్ వివాదం..

Highlights

Hyderabad: హిజాబ్ తొలగించడంతో పరీక్ష కేంద్రంలోకి అనుమతించిన

Hyderabad: సంతోష్ నగర్ ఐ.ఎస్.సధన్ చౌరస్తాలో ని కె.వి. రంగారెడ్డి మహిళ డిగ్రీ కళాశాలలో చెందిన కొంతమంది ముస్లిం విద్యార్థులు ఉర్దూ మీడియం డిగ్రీ పరీక్ష రాయడానికి వందలాది మంది హిజాబ్ ధరించి ఇక్కడికి వచ్చారు. కళాశాల సెంటర్‌ వద్ద సిబ్బంది హిజాబ్ ధరించి వచ్చిన యువతులను అడ్డుకున్నారు. హిజాబ్ ధరించడం వల్ల ఎవరో గుర్తు పట్టలేమని తెలిపారు. పరీక్ష సెంటర్ లోకి అనుమతించాలంటే హిజాబ్ తీసి వెళ్లాలని తెలిపారు. అయితే యువతులు మాత్రం హిజాబ్ తీయడానికి ససేమిరా అన్నారు. పరీక్ష రాయడానికి లోనికి అనుమతించాలని కోరారు. అయినా యాజమాన్యం మాత్రం అనుమతించలేదు. ఒకరినొకరు వాదోపవాదలు చేసుకున్నా అనుమతి నిరాకరించారు. ముస్లీం యువతులు దాదాపు అరగంట పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు గత్యంతరం లేక హిజాబ్ తీసి పరీకా కేంద్రానికి వెళ్లారు.

అయితే ముస్లీం యువతులు మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రానికి వచ్చిన మాకు సుమారు అరగంట పాటు లోనికి అనుమతించాలేదని అన్నారు. ఇంతకు ముందు ఇలా కాలేజీ యాజమాన్యం ఇలా ప్రవర్తించలేదని అన్నారు. ఇప్పుడు ఎందుకు ఇలా చేసిందని అర్థం కావడం లేదని వాపోయారు. హిజాబ్ తీసేంత వరకు అనుమతిని నిరాకరించిందని, హిజాబ్ తొలగించాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్దతి కాదని అన్నారు. రేపటి నుంచి హిజాబ్ తొలగించి రావాలని కళాశాల యాజమాన్యం వారిని హెచ్చరించిందని అన్నారు.

ఇది పరీక్ష నిబంధనలకు విరుద్ధమని కళాశాల అధికారులు చెప్పారని తెలిపారు. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు హోంమంత్రి మహమూద్ ఆలీకి ఫిర్యాదు చేసామని అన్నారు. హిజాబ్ తో విద్యార్థినులను కేంద్రంలోకి అనుమతిచక పోవడం సరి కాదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

హిజాబ్ వివాదాన్ని హోంమంత్రి మహమూద్ ఆలీ ఇలా స్పందించారు. ముస్లీం మహిళలకు హిజాబ్ అనేది సర్వసాధారణమని అన్నారు. మహిళలకు ఒంటినిండా బట్టలు దరించడం మంచి సాంకేతమే అన్నారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుతామని అన్నారు. ఇది సరైన పద్దతి కాదని తెలిపారు. తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు వారి నచ్చిన దుస్తులు వేసుకోవడం వారి జన్మ హక్కు అని అన్నారు. దానిని కాదనే అధికారం ఎవరికి లేదని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories