కూలీగా మరిన గ్రామ సర్పంచ్

Special Story On Thukkapur Sarpanch
x

కూలీగా మరిన గ్రామ సర్పంచ్

Highlights

Sarpanch: తనను గెలిపించిన గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలని భావించిన సర్పంచ్‌కి నిరాశే మిగిలింది.

Sarpanch: తనను గెలిపించిన గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలని భావించిన సర్పంచ్‌కి నిరాశే మిగిలింది. గ్రామ అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు జరిపించారు. తీరా చూస్తే అధికారులు సర్పంచ్‌కు బిల్లులు మంజూరు చెయ్యకుండా షాక్ ఇచ్చారు. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక సర్పంచ్ కూలీగా అవతారమెత్తాడు. మరి ఇంతకు ఎక్కడా గ్రామం..? ఏవరా సర్పంచ్..?

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం తుక్కాపురంకు చెందిన దయ్యాల రాజు మూడు సంవత్సరాలకు పైగా గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నాడు. చదువుకున్న యువకుడు కావడంతో ప్రజల కోసం గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. తుక్కాపురం గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మండలంలోనే ముందు వరుసలో ఉంచాలని భావించాడు. కానీ తానొకటి తలిస్తే దైవం మరోటి అన్నట్టు గ్రామాభివృద్ధి కోసం అప్పు తెచ్చి మరీ ఖర్చు చేశాడు. చేసిన పనులకు సంబంధించి బిల్లులను అధికారులకు సమర్పించగా ఇవ్వాళా, రేపు అంటూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక ధాన్యం కొనుగోలు సెంటర్‌లో రోజు వారి గుమస్తాగా పనులు చెయ్యడం గ్రామస్ధులను సైతం కలిచివేస్తోంది. ఇప్పటికీ గ్రామానికి పెట్టిన ఎనిమిది రకాల బిల్లులు మొత్తం 16 లక్షల 99 వేలు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు సర్పంచ్ రాజు. ఎంపీఓ నెలకొకసారి వచ్చి పరిశీలించి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అయితే అధికారులు మాత్రం తమ తప్పిదమేమీ లేదంటున్నారు. కావాలనే రాజు తమని సోషల్ మీడియాలో బదనాం చేస్తున్నాడంటున్నారు. ఎనిమిది లక్షలకు పైగా బిల్లులు మంజూరయ్యాయని ఇంకా మిగిలిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మిగితావి ప్రభుత్వం రీలీజ్ చెయ్యగానే వెంటనే ఇస్తామంటున్నారు. చెక్కులు ఆపేందుకు తమకు అధికారం ఉండదంటున్నారు. త్వరితగతిన పెండింగ్ బిల్లులు వస్తే తమ గ్రామాభివృద్ధికి మరింత పాటు పడే అవకాశం ఉంటుందన్నారు స్థానికులు.


Show Full Article
Print Article
Next Story
More Stories