State Bank Of India : తస్మాత్ జాగ్రత్త..ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ

State Bank Of India : తస్మాత్ జాగ్రత్త..ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ
x
Highlights

State Bank Of India : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలను సైబర్ నేరగాలు ఏదో ఒక విధంగా మోసం చేస్తూ వారి నుంచి...

State Bank Of India : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలను సైబర్ నేరగాలు ఏదో ఒక విధంగా మోసం చేస్తూ వారి నుంచి డబ్బులను కాజేస్తున్నారు. ఫోన్, ఎస్ఎంఎస్, మెయిల్స్ ఇలా ఏది కూడా వదలడంలేదు నేరగాల్లు. ఈ క్రమంలోనే ఎస్ బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతే కాదు సైబర్ మోసగాళ్ల నుంచి ప్రజలు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని లేకపోతే క్షణాల వ్యవధిలో మీ ఖాతా లో బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు అలర్ట్‌గా ఉండకపోతే మోసపోతారని వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ఎలా మోసపోతున్నారో తెలిపింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో గడుపుతున్నారని, వాట్సాప్ లక్ష్యంగా చేసుకుని లింక్‌లు పంపి మీ బ్యాంకు ఖాతాల నగదును దోచేస్తున్నారని తమ ఖాతాదారులను ఎస్‌బీఐ హెచ్చరించింది. అంతే కాదు ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ ద్వారా కొన్ని విషయాలలో జాగ్రతగా ఉండాలని వివరించింది. ఏదో అదృష్టం వరించింది, కోటీశ్వరులం అయిపోతాం అని ఆశపడితే మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తం డబ్బుకే ఎసరుపెడతారని గమనించాలని తెలిపారు.

మీరు లాటరీ గెలుచుకున్నారని, మీకు ప్రైజ్ మని మీ అకౌంట్లో ఇస్తామని మీ ఎస్‌బీఐ బ్యాంకు నెంబర్ నుంచి సంప్రదించాలని మిమ్మల్ని సూచిస్తారు సైబర్ నేరగాళ్లు. కానీ ఎస్బీఐ ఏం చెపుతుందంటే ఎస్ బీఐ ఖాతాదారులకు ఎలాంటి లాటరీ స్కీమ్ లేదని స్పష్టం చేసారు. కేవలం మిమ్మల్ని నమ్మించేందుకే ఈ విషయాలు మెస్సేజ్ చేయడం లేక ఫోన్ కాల్ ద్వారా మీకు చేరవేస్తారు. లక్కీ కస్టమర్ గిఫ్ట్స్ కూడా మేం అందించడం లేదు. ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ కాల్స్ రూపంలోనూ వివరాలను బ్యాంకు సిబ్బంది అడగరని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories