Kumuram Bheem Asifabad: కొమురంభీమ్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం

Road Accident In Kumuram  Bheem District
x

Kumuram Bheem Asifabad: కొమురంభీమ్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం

Highlights

Kumuram Bheem Asifabad: బెజ్జూరు మండలం పోతెపల్లి వద్ద ఘటన

Kumuram Bheem Asifabad: కొమురంభీమ్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. బెజ్జూరు మండలం పోతెపల్లి-కొరతగూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు అరకగూడ గ్రామానికి చెందిన ఆత్రం మహేష్‌, తుర్రం వెంగయ్య, ఎలుకపల్లి గ్రామానికి చెందిన నరసింహులుగా గుర్తించారు. ఎలకపల్లి నుంచి పోతెపల్లికి ఓ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురి మృతితో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories