Telangana: కవిత, పొంగులేటిలకు రాజ్యసభ అవకాశమా?

Telangana: కవిత, పొంగులేటిలకు రాజ్యసభ అవకాశమా?
x
Highlights

తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ, పెద్దల సభకు ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేకేకు ఈసారి కష్టమేనని కూడా, తెలంగాణ భవన్‌లో చర్చ సాగుతోంది. ఇంతకీ తెలంగాణ నుంచి...

తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ, పెద్దల సభకు ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేకేకు ఈసారి కష్టమేనని కూడా, తెలంగాణ భవన్‌లో చర్చ సాగుతోంది. ఇంతకీ తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళతారంటున్న ఆ ఇద్దరు ఎవరు? కేకేకు ఎందుకు టఫ్‌ అంటున్నారు? రాజ్యసభ బెర్తులపై, గులాబీ బాస్‌ ఆలోచనలేంటి?

తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. కొత్తవారికిస్తారా...పాతవారినే కంటిన్యూ చేస్తారా అన్నదానిపై టీఆర్ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది.

ఏప్రిల్ 9న తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాలీ అవుతున్నాయి. అప్పటిలోపు ఆయా సీట్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్టంలో గరికపాటి మెహన్ రావు, కేవీపీ, కేకే, ఎంఏ ఖాన్, టీ సుబ్బిరామి రెడ్డి, తోట సీతారామ లక్ష్మీలు ఏప్రిల్ 10న పెద్దల సభకు ఎన్నికయ్యారు. అయితే రాష్ట విభజన కావడంతో లాటరీ విధానంలో గరికపాటి, కేవీపీలను మినహా మిగిలిన నలుగురినీ ఏపీకి కేటాయించారు. అయితే తెలంగాణ కోటాలో ఖాలీ అవుతున్న రెండు సీట్లు టీఆర్ఎస్ ఖతాలోకి వెళ్లడం ఖాయం. అసెంబ్లీలో సంఖ్యా బలం రిత్యా...రెండింటికి రెండూ గులాబి పార్టీకి దక్కనున్నాయి. దీంతో పెద్దల సభపై ఆ పార్టీలో చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ దఫా ఏపీ కోటాలో రిటైర్ అవుతున్న, టీఆర్ఎస్‌ జనరల్ సెక్రటరి కేకే, మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పార్టీకి తాను చేసిన సేవలతో పాటు పార్టీ బాణీని పెద్దల సభలో బలంగా వినిపించేందుకు, కేసీఆర్ తలపెట్టిన ఫెడరల్ ఫ్రంట్‌ను హస్తిన కేంద్రంగా సమన్వయం చేసేందుకు తనను మరోసారి రాజ్యసభకు పంపుతారని కేకే విశ్వసిస్తున్నారు. కాని కేకేకు ఈ దఫా అవకాశం ఉండదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వయోభారంతో పాటు ఇతరులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో కేకేను పక్కన పెడతారని తెలుస్తోంది.

కేకే కు బదులు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు ఈ దఫా రాజ్య సభ సీటు ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేసీఆర్ కూతురైనప్పటికీ వివిధ కారణాల వల్ల కవిత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజమాబాద్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు కవిత. పంచాయతీ, పురపోరు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను రాజ్యసభకు పంపడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు, వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు, సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన ఉన్న కవితను, రాజ్యసభకు పంపితే...హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందంటున్నారు పార్టీ నేతలు. అందుకే ఈ దఫా కేకేను కాదని కవితకే అవకాశం కల్పిస్తారని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. అందుకే తాజాలు కాకుండా మాజీలకే ఈ దఫా రాజ్యసభ సీటు అని భావిస్తున్నారు.

ఇక ఒక సీటు కవితకు పోను మిగిలిన మరో సీటుపై మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి నాయిని రాజ్యసభలో తనకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండటం, పార్టీలో అత్యంత సీనియర్ కావడం, ఈ దఫా మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడం, తన అల్లుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో...కచ్చితంగా తనకు రాజ్యసభ సీటు ఇస్తారని నాయిని నమ్ముతున్నారు. కానీ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే పెద్దల సభపై హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇలా రెండు సీట్లను తాజాలకు కాకుండా మాజీలకు అప్పజెబుతారని తెలుస్తోంది. పార్టీకి వారు చేసిన సేవలు, పార్టీ అవసరాల రిత్యా వారి ఎంపిక జరిగిందని, నామినేషన్ల నాటికి కవిత, పొంగులేటి పేర్లు అధికారికంగా వెలువడతాయని సమాచారం. అయితే బీసీ వర్గానికి చెందిన కేకేను కాదని..రెండింటికి రెండు సీట్లను జనరల్ వర్గాలకే కేటాయిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయనే మరో వాదన పార్టీలో వినిపిస్తోంది. కాని ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుంచి బండా ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్‌లకు అవకాశం కల్పించిన నేపథ్యంలో.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే..కవిత, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లను కేసీఆర్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేస్తే తప్ప, ఇద్దరు మాజీలు మరోసారి పార్లమెంటు మొట్లెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories