ఇందూరులో రసవత్తర పోరు.. మంత్రి ప్రశాంత్ రెడ్డికి కీలకంగా..

ఇందూరులో రసవత్తర పోరు.. మంత్రి ప్రశాంత్ రెడ్డికి కీలకంగా..
x
ప్రశాంత్ రెడ్డి
Highlights

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు పురపోరుపై దృష్టిపెట్టాయి. పోటీకి సై అంటే సై అంటున్నాయి. మున్సిపాలిటీలపై తమ జెండా...

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు పురపోరుపై దృష్టిపెట్టాయి. పోటీకి సై అంటే సై అంటున్నాయి. మున్సిపాలిటీలపై తమ జెండా ఎగురువేయాలని రాజకీయ పార్టీలు ఉవ్విళ్లురుతున్నాయి. ఉమ్మడి నిజామాద్ జిల్లాలో ఓ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనుండగా మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు తొలిసారిగా జరగనున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో ఎల్లారెడ్డి, భీంగల్, బాన్సువాడ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా కొత్తగా ఆవిర్భవించాయి. నిజామాబాద్ నగర పాలక సంస్ధతో పాటు కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల్లో శివారు కాలనీలు, పలు గ్రామ పంచాయతీల విలీనంతో పట్టణాల పరిధి పెరిగింది. చాలా మున్సిపాలిటీల్లో వార్డుల సరిహద్దులు మారిపోయాయి. గత రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. కొత్త రిజర్వేషన్లు ఎవరికి అనుకూలంగా వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది. ఛైర్మన్- డివిజన్ల రిజర్వేషన్ల పై సస్పెన్స్ కొనసాగుతోంది. తొలిసారి ఎన్నికల బరిలో ఉన్న ఎల్లారెడ్డి, భీంగల్, బాన్సువాడ మూడు మున్సిపాలిటీలతో ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

అసెంబ్లీ ఎన్నికల స్పూర్తితో నిజామాబాద్ నగరపాలక సంస్ధతో పాటు 6 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలని అధికార టీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మకాం వేసి పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించారు. నోటీఫికేషన్‌కు నెల రోజుల ముందు నుంచే అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాల అందచేత కార్యక్రమాలు జోరుగా చేపట్టారు. మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు అప్పగించడంతో ఎమ్మెల్యేలు గులాబీ జెండా ఎగురవేసేందుకు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. అధికార పార్టీ నుంచి సిట్టింగుల్లో చాలా మందికి టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు తంటాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, పట్టణాల్లో జరిగిన అభివృద్దిని నినాదాలతో ముందుకు తీసుకు పోతున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల గెలుపుతో ఊపు మీద ఉన్న కమలం పార్టీ ఈ సారి మెజార్టీ మున్సిపాలిటీలపై కాషాయ జెండా రెపరెపలాడించాలని నేతలు యోచిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరు బాట పట్టిన ఆ పార్టీ నేతలు అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో పడ్డారు. పట్టణాల్లో బలం పెంచుకున్న ఆ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు యువకులు ఉత్సాహాం చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోడీ పాలనలో గొప్ప విషయాలను ఓటర్లకు చేరవేస్తూ ముందుకు సాగేలా కార్యచరణ సిద్దం చేశారు. పట్టణాల్లో కొత్త కమిటీలను వేశారు. ఎంపీ అర్వింద్ తన పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అభ్యర్ధుల ఎంపిక సైతం అర్వింద్ కనుసన్నల్లో జరిగేలా చూస్తున్నారు.

వరుస ఓటములతో డీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల్లో సత్తా చాటాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నేతలు 50శాతానికి పైగా యువతకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఇటు మైనార్టీల్లోను హస్తం పార్టీకి ఆదరణ పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో సమస్యలు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేలా కార్యచరణ సిద్దం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో బలాన్ని చాటుకునేందుకు గెలుపు వ్యూహాలు రచించే పనిలో ఆ నేతలు పడ్డారు. జిల్లా నేతలు మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీ- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిజామాబాద్‌ జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు MIM పార్టీ కూడా నిజామాబాద్ నగర పాలక సంస్ధలో పాగా వేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధాన పార్టీలు ఎన్నికలకు సై అంటుడటంతో పుర రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కీలకంగా మారనున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories