Secunderabad: సికింద్రాబాద్ విధ్వంసంపై రాజకీయ వేడి

Political Heat over Secunderabad Demolition Incident
x

 Secunderabad: సికింద్రాబాద్ విధ్వంసంపై రాజకీయ వేడి

Highlights

Secunderabad: బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మాటలతూటాలు

Agnipath Protests: అగ్నిపథ్ దేశంలో అగ్ని జ్వాలలు రగిలిస్తోంది. ఈ పథకం వల్ల ప్రయోజనాల కంటే... నిష్ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు నిరుద్యోగ యువకులు. వీరికి బాసటగా నిలిచింది టీఆర్ఎస్. అగ్నిపథ్ ను పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు పథకాన్ని రద్దు చేసి పాత ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.. బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టింది గులాబీ దళం. గుజరాత్, హర్యానా, బీహార్ లతో మొత్తం 12 జరుగుతున్న దాడులకు ఎవరు కారణమని ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

అగ్నిపథ్ యావత్ దేశంలో అగ్గి రగిలిస్తోంది. దీనికి తెలంగాణ మినహా లేకుండాపోయింది. ఆర్మీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై విధ్వంసం సృష్టించారు. పోలీస్ కాల్పులు, లాఠీ ఛార్జ్ ఘటనలో ఒక్కరూ మృతి చెందగా పలువురు నిరుద్యోగులు, పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో జరిగిన ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏకంగా ఈ దాడి వెనుక సీఎంఓ కుట్ర ఉందని ఆరోపించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కుట్ర ఉందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం రెండూ కూడా ఈ ఘటనలో దోషులేనని ఆరోపించారు. అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అగ్నిపథ్ విషయంలో టీఆర్ఎస్ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈఘటన దురదృష్టకరమని అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్ని కూడా ప్రజా రైతు, సైనిక వ్యతిరేక విధానాలుగా ఆరోపించారు టిఆర్ఎస్ నేతలు. కేంద్ర ప్రభుత్వం రైతు, సైనిక వ్యతిరేక విధానాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. అగ్నిపథ్ విషయంలో జరుగుతున్న దాడులకు పూర్తిగా కేంద్రమే బాధ్యత వహించాలన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

మొత్తానికి తెలంగాణలో అగ్ని పథ్ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వ - ప్రతిపక్షాలు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరస్పరం నేతలు ఒకరి నొకరు దూషించుకుంటున్నారు. ఇక ఈ అంశం చివరికి ఎటు తిరుగుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories