Konda Surekha: దేవుడి పేరుతో.. పీఎం మోదీ రాజకీయం..

PM Modi doing politics in the name of God, says Konda Surekha
x

Konda Surekha: దేవుడి పేరుతో.. పీఎం మోదీ రాజకీయం..

Highlights

Medak: పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు భ్రమను కలిగిస్తున్నారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ అన్నారు.

Medak: పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు భ్రమను కలిగిస్తున్నారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ అన్నారు. రాముడి పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. గజ్వేల్ లోని శోభ గార్డెన్ లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం నియోజికవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... తెలంగాణలో అయితే బీజేపీ గ్రౌండ్ లెవెల్ లో పూర్తిగా పడిపోయిందని, ఈ ఎన్నికలలో పూర్తిగా పతనం అవడం ఖాయమని పేర్కొన్నారు. పేదలకు మోదీ ఏమీ చేయలేదని, అంబానీ, ఆదానీలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. బిజెపి అభ్యర్థి ఏం అభివృద్ధి చేశాడో? చెప్పాలని ఆమె ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల రూపాయల అవినీతి చేసిందని, ఇంకా అనే అక్రమాలు, దోపిడీలకు పాల్పడిందన్నారు. సోషల్ మీడియా వేదికగా అవినీతి, అక్రమాలు వెలుగు చూశాయని, తద్వారానే బిఆర్ఎస్ ప్రజలు గద్దె దించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకు వెళ్ళవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి అమలు చేయబోయే వాటిపైన కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. సేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజును గెలిపించి పార్లమెంట్లోకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మామ, అల్లుళ్ళను నూటికి నూరు శాతం ఇంటికి పంపించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి అన్నారు. కెసిఆర్ ను చింతమడకకు, హరీష్ రావును తోటపల్లికి పంపడమే లక్ష్యమన్నారు. తన ప్రధాన టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో వాళ్లను ఓడించడమేనని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ ఉండాల్సిన అవసరం ఉందని, బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మెదక్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి సోనియాగాంధీకి గిఫ్ట్ ఇవ్వాలని తెలంగాణ ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. నిద్రపోకుండా నీలం మధును గెలిపించుకొని ఆయనను పార్లమెంటుకు పంపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజికవర్గ ఇన్చార్జి ప్రమోద్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి నర్సారెడ్డి, నర్సాపూర్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, ఒంటేరు నరేందర్ రెడ్డి, కేశిరెడ్డి రవీందర్ రెడ్డి, రాగుల రాజు, తాడూరి వెంకట్రామిరెడ్డి,హనునంత్ రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories