Uttam Kumar: మంత్రి ఉత్తమ్‌తో NDSA కమిటీ సమావేశం

NDSA Committee Meeting With Minister Uttam Kumar
x

Uttam Kumar: మంత్రి ఉత్తమ్‌తో NDSA కమిటీ సమావేశం 

Highlights

Uttam Kumar: మమ్మల్ని విమర్శించే అర్హత బీజేపీకి లేదు

Uttam Kumar: మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌రెడ్డితో NDSA కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో NDSA కమిటీ 4 రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు.

ప్రాథమిక రిపోర్టును వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దాని ఆధారంగానే డ్యాం రిపేర్‌తో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. కాళేశ్వరం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారటానికి కారణం మోడీయేనని అన్నారు. కార్పొరేషన్ల ద్వారా 84వేల కోట్ల రుణం అందించింది కేంద్రమేనని తెలిపారు. తమను విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు ఉత్తమ్. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నిపుణుల కమిటీ సలహాలు పాటించి మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామన్నారు ఉత్తమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories